Advertisements

తుఫాన్ లో నష్టపోయిన వారిని ఆదుకోవడంలో ప్రభుత్వం విఫలమైంది

తుఫాన్ లో నష్టపోయిన వారిని ఆదుకోవడంలో ప్రభుత్వం విఫలమైంది

రాష్ట్ర మహిళా కార్యదర్శి గుండాల లీలావతి

తుఫాన్ లో నష్టపోయిన వారిని ఆదుకోవడంలో వైసీపీ ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని రాష్ట్ర మహిళా కార్యదర్శి గుండా లీలావతి విమర్శించారు. విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ ముఖ్య మంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేపట్టిన తుఫాన్ ప్రభావతి ప్రాంతాల పర్యటనలో భాగంగా ముఖ్యంగా గూడూరు నియోజకవర్గ పర్యటన బాధితులకు తీవ్ర నిరాశను మిగిల్చిందన్నారు. తిరుపతి జిల్లా పరిసరా ప్రాంతాలలో ఆక్వా రైతులు తుఫాన్ ప్రభావంతో తీవ్రంగా నష్టపోయారు, రొయ్యల గుంటలు జల ప్రయాణానికి కొట్టుకుపోయాయి, దీని వల్ల కోట్ల రూపాయలు ఆక్వా రైతులు నష్టపోయారు,కానీ ఆక్వా రైతులకు ముఖ్యమంత్రి ఎటువంటి హామీ ఇవ్వకపోవడం బాధాకరమన్నారు. ఇప్పటికి కొన్ని గ్రామాలలో విద్యుత్ మరియు తాగునీటి సమస్య ప్రధానంగా ఉందన్నారు. వాకాడు మండలం బాలిరెడ్డిపాళెం గ్రామం లో తుఫాన్ వరద బీభత్సం కారణంగా కొట్టుకుపోయిన ఇళ్ల లబ్ధిదారులను కనీసం పలకరింపు కూడా చేయలేని ముఖ్యమంత్రి ఒక జగన్మోహన్ రెడ్డి అన్నారు. ఉల్లిగడ్డ కి ఉల్లిపాయకి తేడా తెలియని సీఎం, హడావిడి మాటలతో అక్కడినుంచి పరారైనా సీఎం జగన్మోహన్ రెడ్డి అన్నారు. వరి రైతులకు ఇన్సెట్ సబ్సిడీ వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. గత ప్రభుత్వం తెలుగుదేశం పాలనలో నారా చంద్రబాబునాయుడు నేతృత్వంలో తుఫాన్ హెచ్చరికలు చేపట్టేవారు. నష్ట నివారణ చర్యలు కూడా తక్షణమే చేపట్టేవారు.
గూడూరు నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు పాశం సునీల్ కుమార్ చేస్తున్నటువంటి సేవలు, ప్రతిపక్షంలో ఉన్న అధికారపక్షంలా తుఫాన్ పరిసర తు ప్రాంతాల్లో సుడిగాలి పర్యటన చేసి ప్రజల సమస్యలను తెలుసుకుని సత్వర పరిష్కారము వెంటనే వారికి చేపట్టారు అన్నారు
ప్రభుత్వం వెంటనే స్పందించి తుఫాన్ ప్రభావతి ప్రాంతాల్లోని ప్రజలకు విద్యుత్ మరియు త్రాగునీటి సదుపాయం కల్పించాలన్నారు, అదేవిధంగా తుఫాన్ సహాయక సేవలు కల్పించాలని డిమాండ్ చేస్తున్నామన్నారు.

Leave a Comment