ఉమ్మడి నెల్లూరు జిల్లా రాపూరు మండలంలోని గోనుపల్లి గ్రామంలో నీ గవర్నమెంట్ హై స్కూల్ నందు జగనన్న వంట పాత్రల డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా నెల్లూరు మూలపేట శివాలయం మాజీ చైర్మన్ అల్తురు గిరీష్ రెడ్డి మరియు నెల్లూరు కాంట్రాక్టర్ శ్యాంసుందర్ రెడ్డి మరియు రాపూరు పెంచలకోన దేవస్థానం ఇవో జనార్దన్ రెడ్డి మరియు నెల్లూరు రవీందర్ రెడ్డి మరియు నెల్లూరు శివ కుమార్ రెడ్డి గ్రామస్తులు తదితరులుపాల్గొన్నారు.
ఈ కార్యక్రమంలో నెల్లూరు రవీందర్ రెడ్డి మాట్లాడుతూ జగనన్న వంట పాత్రల డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన అల్తూరు గిరీష్ రెడ్డి మా గోనుపల్లి గ్రామ గవర్నమెంట్ హై స్కూల్ కు పర్యవేక్షించి మరమ్మతుల్లో ఉన్న స్కూల్ ఫంక్షన్ హాల్ స్టేజ్ ను మరియు సరస్వతి విగ్రహమును ఈ రెండు పనులు పూర్తి చేస్తానని చెప్పిన గిరీష్ రెడ్డికి కృతజ్ఞతలు తెలుపుతూ మన హైస్కూల్లో చదువుకునే ప్రతి ఒక్క విద్యార్థి విద్యార్థినీలు అందరూ బాగా చదువుకుని మంచి మార్కులతో పాస్ అయ్యి మన గోనుపల్లి హైస్కూల్ కు మంచి పేరు తేవాలని తెలిపి భవిష్యత్తు కాలంలో మన గోనుపల్లి గ్రామ విద్యార్థిని విద్యార్థులు పదో తరగతి పాసైన తర్వాత పక్క ప్రాంతాలకు వెళ్లి చదివే అవకాశం లేకుండా ప్రభుత్వ జూనియర్ కళాశాల కూడా పై ప్రభుత్వ అధికారులకు తెలిపి మన గోనుపల్లి గ్రామంలోనే ప్రభుత్వ జూనియర్ కళాశాల ను ఏర్పాటు చేసేందుకు ప్రయత్నాలు చేస్తామని తెలిపారు.