????వాకాడు మండలం, బాలిరెడ్డి పాళెం గ్రామంలో స్వర్ణముఖి నది కట్ట తెగి నష్టపోయిన ప్రాంతాలను పరిశీలించిన సియం జగన్
⬜ సియం పర్యటన లో భాగంగా ఒక్క రోజులో ఏర్పాట్లు చేసి సియం పర్యటన విజయ వంతం చేసిన అధికార యంత్రాంగం
???? బాలిరెడ్డి పాళెంకు సియం జగన్ చేరుకొని స్వర్ణముఖి నది కట్ట తెగి నష్టపోయిన ప్రాంతాల పరిశీలన
???? వరదల్లో గూడూరు ఆర్డివో కిరణ్ కుమార్ చేపట్టిన రిస్క్యు ఆపరేషన్ ను ల్యాప్ టాప్ లో మూడున్నర నిమిషం వీడియో ను చుసిన సియం జగన్
⬜మిగ్ జామ్ తుపాను కారణంగా తిరుపతి జిల్లా వ్యాప్తంగా నష్ట పరిహారం వివరాలు సియం కు వివరించిన ఆర్డివో కిరణ్ కుమార్
???? బాలిరెడ్డి పాళెం లో ఏర్పాటు చేసిన తుఫాన్ ఫోటోఎగ్జిబిషన్ ను తిలకించిన సియం
???? ఫోటోఎగ్జిబిషన్ లో వివరాలు సియం జగన్ కు వివరించిన ఆర్డివో కిరణ్ కుమార్
⬜ ఆర్డివో చేసిన రిస్క్యు ఆపరేషన్ వీడయో ను చుసిన సియం జగన్ -శభాష్ కిరణ్ అంటూ అభినందనలు
???? తిరుపతి జిల్లాలో ముంపు గ్రామాలన్నిటింకి సాయం ప్రకటించిన సియం
⬜వర్షాల కారణంగా లోతట్టుప్రాంతాలు మునిగిపోగా.. వారి కోసం 92 రిలీఫ్ కేంద్రాలను ఏర్పాటు చేసి.. 8,364 మందికి అక్కడికి తరలింపు
???? 60 వేల మంది బాధితులకు 25 కేజీల రేషన్ బియ్యం, నిత్యవసర సరుకులు పంపిణి
????ప్రతి ఇంటికీ రూ. 2500 వాలంటీర్ల ద్వారా అందజేత
⬜ హై లెవల్ బ్రిడ్జి కట్టేందుకు రూ.30 కోట్లు ఖర్చు .. తక్షణమే బ్రిడ్జి నిర్మాణానికి నిధులు:సియం జగన్
???? మిగ్ జామ్ తుపాను లో ప్రాణాలు తెగించి సేవ చేసిన అధికారులకు అభినందనలు :సియం జగన్
గడిచిన వారంలో మిగ్ జామ్ తుపాను కారణంగా ఏపీలో కురిసిన భారీ వర్షాలు రైతులకు అపార నష్టాన్ని తెచ్చిపెట్టాయి. శుక్రవారం తిరుపతి జిల్లా,వాకాడు మండలం బాలి రెడ్డి పాళెం గ్రామం లో స్వర్ణముఖి నది కట్ట తెగి నష్టపోయిన ప్రాంతాలను ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తాడేపల్లి నుండి హెలికాప్టర్ లో విద్యానగర్ ఎన్ బి కె ఆర్ క్రీడా ప్రాంగణం లో ఏర్పాటు చేసిన హెలిప్యాడ్ వద్ద దిగి భారీ క్యాన్వాయి లో రోడ్డు మార్గం లో బాలి రెడ్డి పాళెం కు చేరుకొని స్వర్ణముఖి నది కట్ట తెగి నష్టపోయిన ప్రాంతాలను పరిశీలించారు.
ఆర్డివో కిరణ్ కుమార్ చేపట్టిన రిస్క్యు ఆపరేషన్ వీడియో ను చూసిన సియం జగన్
మిగ్ జామ్ తుపాను ప్రభావం తో మూడు రోజుల పాటు కురిసిన వర్షాలకు స్వర్ణ ముఖి నది ఉప్పొంది. బాలిరెడ్డి పాళెం వద్ద స్వర్ణ ముఖి నది కట్ట తెగిపోవడం తో గ్రామం మొత్తం జలదిగ్బంధం లో చిక్కుకుంది.జలదిగ్బంధంలో రొయ్యలు గుంట వద్ద నున్న ఇద్దరూ వ్యక్తులు చిక్కుకున్నారు. విషయం తెలుసుకొన్న ఆర్డివో కిరణ్ కుమార్ జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీ లకు సమాచారం అందించి వారి ఆదేశాల మేరకు రిస్క్యు ఆపరేషన్ చేపట్టి ఇద్దరూ ప్రాణాలు కాపాడారు. ఓ ప్రక్క స్వర్ణ ముఖి నది ఉదృత ప్రవాహం మరో ప్రక్క జోరు వాన ఈదురు గాలుల భిభత్సం అయినా కుడా వాటిని లెక్క చేయకుండా ఆర్డివో కిరణ్ కుమార్, వాకాడు సి ఐ హరికృష్ణ, నాయుడుపేట సి ఐ నరసింహ రావు లు ప్రాణాలకు తెగించి ఇద్దరూ వ్యక్తులను కాపాడారు.
బాలి రెడ్డి పాళెం వద్ద స్వర్ణ ముఖి నది కట్ట తెగిన ప్రాంతం లో చేపట్టిన రిస్క్యు ఆపరేషన్ వద్ద కు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వచ్చి పరిశీలించారు. అక్కడే ఆర్డివో చేపట్టిన రిస్క్యు ఆపరేషన్ వీడియో ను సియం జగన్ ల్యాప్ టాప్ లో మూడున్నర నిముషాలు వీడియో ను చూసి ఆర్డివో ను, రిస్క్యు బృందం లో ఉన్న అధికారులు ను అభినందించారు.
బాలి రెడ్డి పాళెం లో తుఫాన్ ఫోటో ఫోటోఎగ్జిబిషన్
మిగ్ జామ్ తుపాను భిభత్సంలో తిరుపతి జిల్లా వ్యాప్తంగా అధికారులు, ప్రజా ప్రతినిధులు చేసిన సేవలు మరియు రిస్క్యు ఆపరేషన్ ద్వారా చేపట్టిన సాహసాలు, పునరావాస కేంద్రాలు ఇలా ఎన్నో రకాల కార్యక్రమాలు ఫోటోలతో ఫోటో ఫోటోఎగ్జిబిషన్ ను అధికారులు ఏర్పాటు చేశారు. ఈ ఫోటో ఫోటోఎగ్జిబిషన్ ముఖ్యమంత్రి జగన్ తిలకించారు. ఆర్డివో కిరణ్ కుమార్ అన్నీ విషయాలు సియం కు క్షుణంగా వివరించి వరద నష్టాల అంచనాలు, వరదలో చిక్కుకొన్న గ్రామాల వివరాలు అన్నీ సియం కు ఆర్డివో వివరించారు. ఇక్కడ విశేషం ఏమిటంటే.. ఫోటోఎగ్జిబిషన్లో ఆర్డివో చేసిన సేవలు, సాహసాలు అన్నీ సియం చూసి శభాష్ కిరణ్ అంటూ ప్రశంసించారు.
భారీ వర్షాల వల్ల నష్టపోయిన ప్రతి రైతును ఆదుకుంటామని సియం హామీ
భారీ వర్షాల వల్ల నష్టపోయిన ప్రతి రైతును ఆదుకుంటామని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ.. నాలుగైదు రోజుల్లో రాష్ట్రం కురిసిన వర్షానికి మనకు వచ్చిన కష్టం.. వచ్చిన నష్టం వర్ణణాతీతమన్నారు.తుఫాన్ లో నష్టపోయినా ప్రతీ కుటుంబం కు అండగా ఉంటాము. వారిని అన్నీ విధాలా అదు కుంటాం, అధికారులు ను, వాలెంటర్లను ప్రతీ ఇంటికి పంపి ఆర్థిక సహాయం అందిస్తాం అనీ తెలిపారు.
60 వేల మంది బాధితులకు 25 కేజీల రేషన్ బియ్యం, నిత్యవసరాలు, ప్రతి ఇంటికీ రూ. 2500 వాలంటీర్ల ద్వారా అందజేత :సియం జగన్
వర్షాల కారణంగా లోతట్టుప్రాంతాలు మునిగిపోగా.. వారి కోసం 92 రిలీఫ్ కేంద్రాలను ఏర్పాటు చేసి.. 8,364 మందికి అక్కడికి తరలించినట్లు తెలిపారు. 60 వేల మంది బాధితులకు 25 కేజీల రేషన్ బియ్యం, నిత్యవసరాలు, ప్రతి ఇంటికీ రూ. 2500 వాలంటీర్ల ద్వారా అందజేశామని, అందని వారికి వాలంటీర్లే వచ్చి ఇస్తారన్నారు. నాలుగు రోజుల్లో ఈ ప్రక్రియ పూర్తవుతుంది. పంట నష్టం గురించి కూడా ఎవరూ బాధపడొద్దని ఆదుకుంటామని చెప్పారు. నష్టపోయిన రైతులకు 80 శాతం సబ్సిడీతో విత్తనాలను అందిస్తామన్నారు. అలాగే స్వర్ణముఖిపై హై లెవల్ బ్రిడ్జి నిర్మాణం చేపడుతామనీ సియం చెప్పారు.
హై లెవల్ బ్రిడ్జి నిర్మాణం కు సియం గ్రీన్ సిగ్నల్
హై లెవల్ బ్రిడ్జి కట్టేందుకు రూ.30 కోట్లు ఖర్చవుతుందని.. తక్షణమే బ్రిడ్జి నిర్మాణానికి నిధులు షాంక్షన్ చేస్తున్నట్లు సీఎం జగన్ తెలిపారు. జిల్లాలో 110 ట్యాంకులు ఉండగా.. వాటిలో కొన్ని చోట్ల బ్రీచ్ అయ్యాడు.త్వరలోనే రోడ్లు రిపేర్ చేసే కార్యక్రమాలు, టెంపరరీ పనులన్నీమొదలుపెడతామన్నారు. ఏ చిన్న సమస్య ఉన్నా, ఏ సంక్షేమ పదకం అందకపోయినా 1902కు ఫోన్ చేసి ఫిర్యాదు చేస్తే.. కలెక్టర్ చర్యలు తీసుకుంటారని సీఎం జగన్ తెలిపారు.