Advertisements

తుఫాను ప్రభావిత ప్రాంతాలలో  పర్యటన  చేసిన ఎమ్మెల్సీ బల్లి.కళ్యాణ్ చక్రవర్తి

తేది:-07-12-2023,కాకివాకం గ్రామం,వాకాడు మండలం,తిరుపతి జిల్లా..వాకాడుమండలం,దుగరాజపట్నం పంచాయతీ,కాకివాకం గ్రామాన్ని సందర్శించిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనమండలి సభ్యులు  బల్లి కళ్యాణ్ చక్రవర్తినాలుగు రోజులు నుండి ప్రపంచంతో సంబంధాలు తెగిపోయి తీర ప్రాంతంలో నాలుగు వైపుల నీటి మధ్యలో ఇరుక్కుపోయిన కాకివాకం గ్రామ ప్రజల్ని కలుసుకున్న ఎమ్మెల్సీ బల్లి కళ్యాణ్ చక్రవర్తి ఈ గ్రామంలో నివసిస్తున్న ప్రతి కుటుంబానికి ఇరవై అయిదుకే.జిలబియ్యం,కూరగాయలు స్వయంగా వెళ్లి ఎమ్మెల్సీ బల్లి కళ్యాణ్ చక్రవర్తి  ఇవ్వడం జరిగింది.

దుగరాజపట్నం నుండి  రెండు గంటలు పడవలో ప్రయాణం చేసి కాకివాకం గ్రామానికి చేరుకోవడం జరిగింది.ఎమ్మెల్సీ  మాట్లాడుతూ గూడూరు నియోజవర్గంకి సంబంధించి ఎప్పుడు వరదలు వచ్చిన విపత్తులు వచ్చిన అధికారులు తప్పకుండా గుర్తించుకోవలసిన మొట్టమొదటి గ్రామం కాకివాకం అని తెలియజేశారు.

రేపు వాకాడు మండలం కి విచ్చేయుచున్నముఖ్యమంత్రివర్యులు  తప్పకుండా ఈ గ్రామం యొక్క సమస్యలను తీసుకొని వెళ్తానని ఎమ్మెల్సీ తెలియజేశారుఎమ్మెల్సీ  వెంట గూడూరు నియోజకవర్గ  వై.యస్.ఆర్.సి.పి యూత్ అధ్యక్షుడు చిల్లకూరు* *సాయి ప్రసాద్ రెడ్డి,వై.యస్.ఆర్.సి.పి నాయకులు కె.దిలీప్ రెడ్డి,వెంకటగిరి* *వై.యస్.ఆర్.సి.పి యూత్ అధ్యక్షుడు కె.శ్రీనివాస్ రాజు (యోగి),దుగ్గరాజుపట్నం సర్పంచ్ మహేంద్ర,కొణిదెల నాగేంద్ర,బి.సి సంఘం అధ్యక్షుడు జగదీష్ మరియు తదితరులు పాల్గొన్నారు

Leave a Comment