Advertisements

యువనేస్తం అసోసియేషన్ ఆధ్వర్యంలో మెడికల్ క్యాంపు

ఏర్పేడు (డిసెంబర్ 6) బుధవారం యువనేస్తం అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పేడు మండలం రాజులపాలెం ఎస్టి కాలనీలో గుడిసెలో ఉన్న గిరిజనులకు మండల కో ఆర్డినేటర్ అరుణ ఎ ఎన్ యం వెంకటమ్మ ద్వారా ఉదయం మెడికల్ క్యాంపు నిర్వహించి మధ్యాహ్నం ఇంటింటికి వెళ్లి లెమన్ రైస్ పంపిణీ చేయడం జరిగిందని యువనేస్తం అసోసియేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు మధురాంతకం. మునిశేఖర్ తెలిపారు. ఈ సందర్భంగా మునిశేఖర్ మాట్లాడుతూ ఎక్కువ గా వర్షాలు పడడం వలన గుడిసెలో నివసిస్తున్న పేదవారు చాలా ఇబ్బంది పడుతున్నారని తెలిపారు. పేదవారికి సహాయం చేయడానికి దాతలు ముందుకు రావాలని కోరారు.ఈ కార్యక్రమంలో యువనేస్తం అసోసియేషన్ మండల కో ఆర్డినేటర్ అరుణ.ఎ యన్ యం వెంటకమ్మ, యువనేస్తం వాలంట్రీలు ముత్యాలమ్మ, మారయ్య, అంకయ్య తదితరులు పాల్గొన్నారు.

Leave a Comment