Advertisements

పవిత్ర రెడ్డి బియ్యపు ఎమ్మెల్యే శాశ్వత రహదారి బ్రిడ్జి నిర్మాణం

ఏర్పేడు (డిసెంబర్ 6)… గత నాలుగు రోజులుగా పడుతున్న భారీ వర్షాలతో ఏర్పేడు మండలంలోని చెన్నంపల్లి గ్రామం పోయే రహదారి వరద తాకిడికి రహదారి మొత్తం కొట్టుకుపోవడంతో సమాచారం అందుకున్న శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి కుమార్తె శ్రీపవిత్ర రెడ్డి బియ్యపు ఎమ్మెల్యే ఆదేశాలను సారం చెన్నంపల్లి గ్రామానికి వెళ్లి చెన్నంపల్లి రహదారిని అధికారులతో కలిసి పరిశీలించారు.

శ్రీపవిత్ర రెడ్డి మాట్లాడుతూ..
ఏర్పేడు మండలం చెన్నంపల్లి గ్రామం నందు రహదారి ఏర్పాట్లపై గతంలో రహదారికి పనులు ప్రారంభించామని, గ్రావెల్ తో రోడ్డు నిర్మాణ పనులు చేపట్టామని, చేసిన పనులు మొత్తం వరదతాకిడికి కొట్టుకుని వెళ్లిపోయిందని, త్వరలోనే శాశ్వత రహదారి మరియు బ్రిడ్జి నిర్మాణ పనులను శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి సహకారంతో పూర్తి చేస్తామని గ్రామస్తులకు హామీ ఇచ్చారు.

గ్రామస్తులు మాట్లాడుతూ.. ఏర్పేడు మండలం చెన్నంపల్లి గ్రామం రహదారి గతంలో ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి పరిశీలించారని, రహదారి ఏర్పాటుపై నిధులు మంజూరు చేశారని, కానీ అకాలవర్షంతో నేడు చేసిన పనులు వరద తాకిడికి కొట్టుకుని వెళ్లిపోయిందని, తమ అవస్థలు తెలుసుకున్న ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి కుమార్తె శ్రీపవిత్ర రెడ్డి తమ గ్రామానికి వచ్చి, తమను పరామర్శించి తమ యోగక్షేమాలు అడిగి తెలుసుకుని తమ గ్రామానికి శాశ్వత రహదారి బ్రిడ్జి నిర్మాణం ఏర్పాటు చేసే విధంగా కార్యాచరణ త్వరలోనే ప్రారంభిస్తామని హామీ ఇవ్వడం సంతోషంగా ఉందంటూ ఆనందం వ్యక్తం చేశారు.గత 30 ఏళ్లుగా ఎందరో ప్రజాప్రతినిధులను తమ అవస్థలను తెలియజేసిన పట్టించుకోలేదని, నేడు తమ కష్టాలను నేనుఉన్నాను నేను మీ కష్టాలను తీరుస్తాను, అంటూ వస్తున్న ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డికి, శ్రీపవిత్ర రెడ్డికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.

ఈ కార్యక్రమంలో ఏర్పేడు మండల ఇంఛార్జి గునెరి కిషోర్ రెడ్డి,మండల అధ్యక్షులు రమణయ్య యాదవ్,భక్తి సెట్టి,ఎస్.ఎస్ చంద్ర,రమేష్ రెడ్డి,సర్పంచ్ సుధీర్,మస్తాన్,కేశవులు, మని గ్రామస్థులు తదితరులు పాల్గొన్నారు.

Leave a Comment