ఏర్పేడు.. గత కొద్ది రోజులుగా కురిసిన వర్షాలకు ఇబ్బంది పడుతున్న గిరిజనులకు డాక్టర్ సిపాయి సుబ్రహ్మణ్యం సిపాయి భరోసా అందజేశారు. ఏర్పేడు మండలంలోనీ,చింతల పాల్లెం ,పల్లాంపేటలో ఇటీవల కురిసిన భారీ వర్షాలకు ఇబ్బంది పడుతున్న300 గిరిజన కుటుంబాలకు ఉమ్మడి చిత్తూరు జిల్లా ఎమ్మెల్సీ , రష్ హాస్పిటల్ అధినేత డాక్టర్ సిపాయి సుబ్రమణ్యం నిత్యవసర సరుకులు అందజేసి భరోసా గా నిలిచారు.ఈ కార్యక్రమంలో ఏర్పేడు ఇంఛార్జి గున్నెరి కిషోర్ రెడ్డి,మండల అధ్యక్షులు రమణయ్య యాదవ్,కో అప్సన్ మెంబర్ బత్తి సెట్టి,చింతలపాల్లెం సర్పంచ్ బాల,ప్రసాద్,కుమర్రెడ్డి , ఎక్స్ ఎంపీటీసీ మునిరత్నం రెడ్డి, ముని కృష్ణ రెడ్డి,దాము,హేమాద్రి,శీను,వెంకటేశ్వర రావు తదితరులు పాల్గొన్నారు.