Advertisements

నాడు మాండస్ తుఫాన్ లో…నేడు మిచౌంగ్‌ తుఫాన్‌ లో ..ఒకే ఒక్కడు ఆర్డివో కిరణ్ కుమార్ సేవలు..

???? మిచౌంగ్‌ తుఫాను ధాటికి జనజీవనం అస్తవ్యస్తం

????విరిగిపడిన చెట్లు, కరెంటు స్తంభాలు… ఉప్పొంగిన వాగులు వంకలు…

???? వాకాడు మండలం, బాలిరెడ్డి పాళెం గ్రామం సమీపంలోనీ తెగిన స్వర్ణముఖి నది కట్ట

???? వరదల్లో చీకుకొన్న ఇద్దరూ వ్యక్తులు

???? విషయం తెలుసుకొన్న ఆర్డివో కిరణ్ కుమార్.. హుటా హుటిన బా లిరెడ్డి పాళెం కు చేరుకొన్న ఆర్డివో

???? అగ్నిమాపశాక, ఏపీ ఎస్డిఆర్ఎఫ్ లతో కలిసి రిస్క్ ఆపరేషన్ చేపట్టిన ఆర్డివో

???? జోరు వానలో, వరద ఉదృతి లో ప్రాణాలు సైతం లెక్క చేయని ఆర్డివో

???? ఇద్దరినీ ప్రాణాలతో కాపాడి ఒడ్డుకు తీసుకోని వచ్చి పునరావాస కేంద్రం తరలించిన ఆర్డివో

???? సాహసానికి మారు పేరు ఆర్డివో కిరణ్ కుమార్

???? ఆర్డివో సాహసానికి నివ్వేరాపోయిన బాలిరెడ్డి పాళెం గ్రామ ప్రజలు

???? ఆర్డివో సాహసానికి గ్రామ ప్రజలు ఫిదా

????ఇలాంటి అధికారి నీ చూడలేదు అంటూ ఆర్డివో సేవలకు ప్రజలు నీరజనాలు

???? మా ప్రాణాలు కాపాడిన ఆర్డివో కు రుణపడి ఉంటాం :వరద బాధితులు

తుఫాను… జనజీవనాన్ని అస్తవ్యస్తం చేసింది. భీకర గాలులు, జోరు వానతో తీరంపై విరుచుకుపడింది. గూడూరు డివిజన్ లో కురిసిన కుండపోతకు జనజీవనం అస్తవ్యవస్థమైంది. గ్రామీణ ప్రాంతాలను సైతం మిగ్‌ జాం అతలాకుతలం చేసింది. వాగులు, వంకలు పొంగి రాకపోకలకు అంతరాయం కలిగింది. చెట్లు, కరెంట్‌ స్తంభాలు కూలి విద్యుత్‌ సరఫరా నిలిచిపోయింది. గూడూరు డివిజన్ లో రహదారులు, లోతట్టు ప్రాంతాలు నీటమునిగాయి. పెద్దపెద్ద చెట్లు నేలకొరిగాయి.గూడూరు నియోజకవర్గంలో ఈదురు గాలులకు పూరిళ్ల పైకప్పులు ఎగిరి పోయాయి.

మిచంగ్ తుఫాన్ ప్రభావంతో మూడు రోజుల నుండి కురుస్తున్న భారీ వర్షాలు వలన గూడూరు డివిజన్ లోని లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. వాకాడు మండలం లోని వాకాడు స్వర్ణ ముఖి నది ఉప్పొంది ప్రహహించడం తో స్వర్ణ ముఖి బ్యారేజ్ దిగువ ప్రాంతం లో ఉన్న బాలిరెడ్డి పాళెం వద్ద స్వర్ణ ముఖి నది కట్ట తెగడంతో బాలిరెడ్డి పాళెం గ్రామం వరదల్లో చిక్కుకుంది. రెండు పెద్దబిల్డింగ్లుకూలిపోయాయి.వరదల్లో ఇద్దరూ వ్యక్తులు చీకుకున్నారు.

విషయం తెలుసుకొన్న గూడూరు రెవెన్యూ డివిజనల్ అధికారి ఎం. కిరణ్ కుమార్ జిల్లా కలెక్టర్ వెంకట రమణ రెడ్డి, తిరుపతి జిల్లా ఎస్పీ పరమేశ్వర రెడ్డి లకు బాలి రెడ్డి పాళెం పరిస్థితులపై సమాచారం అందించారు. స్పందించిన ఎస్పీ పోలీసులతో బాలిరెడ్డి పాళెం కు చేరుకొన్నారు. వీరితో తిరుపతి జిల్లా చీఫ్ ఫైర్ ఆఫీసర్ కుడా చేరుకొన్నారు.అగ్నిమాపశాక, ఏపీ ఎస్డిఆర్ఎఫ్ బృందాలతో కలిసి ఆర్డివో రిస్క్ ఆపరేషన్ చేపట్టి వరద ఉదృతం లో వర్షాలను సైతం లెక్క చేయకుండా నది ప్రవాహం లో ప్రాణాలు సైతం లెక్క చేయకుండా ఎంతో శ్రమించి వరదల్లో చిక్కుకున్న ఇద్దరి వ్యక్తులను కాపాడి ఒడ్డుకు చేర్చి వారిని పునరావాస కేంద్రం కు తరలించారు.జిల్లా ఎస్పీ సైతం ఆర్డివో సాహసానికి అభినందనలు తెలిపారు. ఆర్డివో అధికారి గా కాకుండా ప్రజల్లో ఒక్కడి గా ఉంటూ సేవ చేయడం తో ప్రజలు ఫిదా అవుతున్నారు. డివిజనల్ అధికారి హోదా లో ఉన్న క్రింది స్థాయి అధికారులకు ఆదేశాలు ఇవ్వచ్చు కానీ ఆర్డివో కిరణ్ కుమార్ ఎప్పుడు హోదా ఉన్నట్లు ఉండరు ఒక్క సామాన్య వ్యక్తి లా ఉంటూ ప్రజలు మెచ్చిన అధికారి అయ్యారు. ఎక్కడ సమస్యలు ఉంటే అక్కడ కు వెళ్లి సమస్యలకు పరిష్కారం చూపడం ఆర్డివో నైజం, బాలిరెడ్డి పాళెం లో ఆర్డివో చేసిన సాహసానిప్రజలునివ్వేరాపోయారు.

ఇలాంటి అధికారి నీ ఇంత వరకు చూడలేదు అనీ ప్రజలే చెప్పడం విశేషం.మా ప్రాణాలు కాపాడిన దేవుడు ఆర్డివో.. ఆయనను ఎప్పటికి మరిచిపోము అనీ వరద బాధితులు సైతం ఆర్డివో కు కృతజ్ఞతలు తెలిపారు.తుఫాన్ భీభత్సం: నీటమునిగిన గ్రామాలను అదుకుంటాం :ఆర్డివో

వాకాడు మండలం బాలి రెడ్డి పాళెం గ్రామంలో గత మూడు రోజులు కురిసిన కుండపోత వర్షానికి స్వర్ణ ముఖి నది ఉదృతం గా ప్రవహించడంతో బాలి రెడ్డి పాళెం వద్ద స్వర్ణ ముఖి నది కట్టలు తెగి గ్రామం పూర్తిగా నీట మునిగింది. పలు పూరిళ్లు కూలిపోయాయి. విషయం తెలుసుకున్న ఆర్డివో కిరణ్ కుమార్ రెవిన్యూ యంత్రాంగం మరియుపోలీస్ యంత్రాంగం మరియు ఇతర అధికారులతో కలసి నీట మునిగిన ప్రాంతాన్ని పరిశీలించారు. వరదల్లో చీకుకొన్న ఇద్దర్ని కాపాడారు.ప్రభుత్వం తరపున పూర్తి సహాయం అందుతుందని బాధితులకు తెలియజెప్పారు. అధికారులు నష్టాన్ని అంచనా వేస్తున్నారు అనీ ఆర్డివో తెలిపారు. ఈ కార్యక్రమం లో వాకాడు సర్కిల్ ఇన్స్పెక్టర్ హరికృష్ణ, వాకాడు ఎస్సై రఘు, తహసీల్దార్, రెవిన్యూ అధికారులు, అగ్ని మాపక అధికారులు తదితరులు ఉన్నారు.

Leave a Comment