Advertisements

వరద కూలీల కుటుంబాలను ఆదుకున్న కందలి సర్పంచ్

మౌచుంగ్ తుఫాన్ కారణంగా భారీ వర్షాలు కురవడంతో చెరువులు, గుంటలు నిండిపోయి, రోడ్లుమీద సైతం నీళ్లు ప్రవహించడం తో జనజీవనం చాలా వరకు స్తభించిపోయింది. కందలి గ్రామానికి సవక కూలీలుగా వచ్చి, వరదలు రావడంతో చిక్కుకొని పోయిన కూలీలను, తిరుపతి జిల్లా గూడూరు మండలం, కందలి సర్పంచ్ బల్లి వెంకటేశ్వర్లు, గ్రామం లోని యువకులతో కలిసి, ఆ కూలీలను, కందలి ప్రభుత్వపాఠశాల వద్ద కు సురక్షితంగా చేర్చడం జరిగింది. బల్లి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ,కందలి పంచాయితీలో  సవక కూలీలుగా వచ్చి వరదలో చిక్కుకున్న 30 కుటుంబాలను సురక్షితంగా స్కూలు దగ్గర వుంచి కరెంట్ లేకపోవడంతో బైక్ లైట్ల సహాయంతో వాళ్లకు భోజనం వసతి కల్పించడం జరిగిందన్నారు.సర్పంచ్ వెంకటేశ్వర్లు తో పాటు, సచివాలయం కన్వీనర్ నవశేఖర్, వేమయ్య,, శివ, మహేష్, తలారి రామయ్య ఈ ఈ సహాయక కార్యక్రమం లో పాల్గొన్నారు.

Leave a Comment