పాడి రైతులకు మరియు గొర్రెల మేకల పెంపకం దారులకు పశుసంవర్ధక శాఖ యొక్క విజ్ఞప్తి
వాతావరణ శాఖ ఇస్తున్న సమాచారం ప్రకారం బంగాళాఖాతంలో అల్పపీడనం వాయుగుండంగా మారి “మిచాంగ్” తుఫాన్ కారణంగా 2/12/2023 నుండి 6/12/2023 అనగా శనివారం నుండి బుధవారం వరకు అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలుస్తోంది
కావున ఆవులను, మేకలను మరియు గొర్రెలను మేపడానికి దూరంగా తీసుకు వెళ్ల వద్దని ఇంటి వద్ద గాని లేదా ఊరి పొలిమేరల్లో మాత్రమే మేపాలని,欄欄 కోరుచున్నాము
ముఖ్యంగా కాలువ గట్టు ప్రాంతాలలో, చెరువుల్లో గాని,అదేవిధంగా పెద్ద కాలువలు దాటి అటుపైన మేపడానికి తీసుకు వెళ్లవద్దని తెలియజేస్తున్నాం.
అదేవిధంగా పాత పశువుల కొట్టాలలో పశువులను మరియు చిన్న జీవాలను ఉంచరాదని తెలియజేస్తున్నాము
అంతేకాక ప్రమాదవశాత్తు అనుకోకుండా వరదలు వలన ఏదైనా పశువులుగాని, చిన్న జీవాలు గానీ మరణిస్తే పశుసంవర్ధక శాఖకు తెలియజేయవలసిందిగా కోరుచూ,
అందరూ అప్రమత్తంగా ఉండి ఎటువంటి నష్టం జరగకుండా, జాగ్రత్తగా ఉండాలని పాడి రైతులకు, విజ్ఞప్తి చేయుచున్నాము
ఇట్లు డా// సురేష్
సహాయ సంచాలకులు
పశుసంవర్ధక శాఖ
ప్రాంతీయ పశువైద్యశాల
గూడూరు