ఈ రోజు (03/12/2023) ఏర్పేడు మండలం చిందేపల్లి ST కాలనీ లో వర్షం కారణంగా మట్టి గోడ తల పైన పడి చిన్నారి మృతి చెందారు. పిల్లాడి ఆత్మ కి శాంతి చేకూరాలని యువనేస్తం అసోసియేషన్ ఆధ్వర్యంలో రాజులపాలెం ఎస్టీ కాలనీ మరియు అబ్బాబట్ల పల్లి ఎస్టి కాలనీ లో నివాళులు అర్పించారని యువనేస్తం అధ్యక్షులు ముని శేఖర్ తెలిపారు, రాబోయే రోజుల్లో వర్షాలు ఎక్కువ వున్నాయి అని వాతావరణ శాఖ తెలియచేసారు,కావున వర్షాలు తగ్గే వరకు మట్టి గుడిసెల్లో నివసిస్తున్న ప్రజలు సురక్షితమైన ప్రదేశాలకు వెళ్ళాలి అని ప్రజలు వర్షాల పట్ల అప్రమత్తం గా ఉండాలి అని మునిశేఖర్ తెలిపారు, ఈ కార్యక్రమం లో మండల కోర్డినేటర్లు అరుణ, నాగమణి, వాలంట్రీలు ముత్యాలమ్మ ,వెంకటేష్, హేమ తదితరులు పాల్గొన్నారు.