నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం.. తుఫాన్‌గా బలపడనుంది. ఇది 5వ తేదీ మంగళవారం ఉదయం నెల్లూరు-మచిలీపట్నం మధ్య తీరం దాటే అవకాశం ఉందని అంచనా వేస్తోంది వాతావరణశాఖ. దీనికి మిచౌంగ్‌గా పేరుపెట్టగా.. తుఫాన్ తీరం దాటే సమయంలో గంటకు 80-100 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయంటున్నారు. సోమవారం ఉదయానికి తుఫాన్ దక్షిణ ఆంధ్రప్రదేశ్, ఉత్తర తమిళనాడు తీరానికి చేరుతుందంటున్నారు. ఆ తర్వాత ఇది దక్షిణ ఆంధ్రప్రదేశ్ తీరానికి సమాంతరంగా వస్తుందని.. మంగళవారం ఉదయం నెల్లూరు-మచిలీపట్నం మధ్య తీరం దాటు తుందనీ అధికారులు తెలిపారు..*ఈ నేపథ్యంలో తిరుపతి జిల్లా కలెక్టర్ వెంకట రమణ రెడ్డి ఆదేశాల మేరకు మిచంగ్ తుఫాన్ కారణంగా శనివారం నుండి కురుస్తున్న భారీ వర్షాలు వలన గూడూరు డివిజన్ లోని ఉన్న లోతట్టు ప్రాంతాలను జాయింట్ కలెక్టర్ డీ కె బాలాజీ,గూడూరు రెవెన్యూ డివిజనల్ అధికారి గూడూరు ఎం. కిరణ్ కుమార్ ల ఆధ్వర్యంలో డివిజన్ స్థాయి మరియు మండల స్థాయి అధికారులతో కలిసి గూడూరు నియోజకవర్గం లోని గూడూరు రూరల్ మండలం,చిల్లకూరు,
*ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ తుఫాన్ ప్రభావంతో కోస్తా, రాయలసీమల్లోని జిల్లాలపై ఉంటుందంటున్నారు. ఈ తుఫాన్ వల్ల ఆదివారం.. దక్షిణ కోస్తా, రాయలసీమల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. అంతేకాదు తుఫాన్ హెచ్చరికలతో మత్స్యకారులు వేటకు వెళ్లవద్దని, రైతులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వారు సూచించారు.నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో మోస్తరు వానలు కురుస్తాయి అనీ వారు తెలిపారు.*సోమవారం తిరుపతి నెల్లూరు జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయని చెబుతున్నారు. అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో*ఓ మోస్తరు వానలకు ఛాన్స్* *ఉందన్నారు.మంగళవారం జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయంటున్నారు.*
*మరోవైపు కోస్తాంధ్రపై మిచౌంగ్ తుఫాన్ తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉందని రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది అనీ చెప్పారు.ఎటువంటి విపత్కర పరిస్థితులు తలెత్తినా సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు సర్వసన్నద్ధం కావాలనిరాయలసీమ కోస్తా తీరం వెంబడి ఉన్న మండలాల అధికారులకు కలెక్టర్ సూచించారు చెప్పారు .
చెన్నై-మచిలీపట్నం మధ్య తుఫాన్ తీరం దాటే అవకాశం ఉందన్నారు. ప్రాణ, ఆస్తి నష్టాలకు తావు లేకుండా అంతా అప్రమత్తంగా ఉండాలన్నారు. ఎన్డీఆర్ ఎఫ్, ఎస్టీఆర్‌ఎఫ్ బృందాలను సిద్ధం చేశామన్నారు.*ఈనెల 6వ తేదీ వరకు సముద్రం అల్లకల్లోలంగా ఉంటుందని.. మత్స్య కారులెవరూ చేపల వేటకు వెళ్లొద్దన్నారు. సము ద్రంపై వేటకు వెళ్లిన మత్స్యకారులను వెంటనే వెనక్కు రప్పించాలన్నారు. వరికోతలను వాయిదా వేసుకోవాలని రైతాంగానికి సూచించారు. మత్స్యశాఖ ద్వారా పడవ లు ఏర్పాటుచేసి గజఈతగాళ్లను నియమించామ న్నారు. గతా నుభవాలను దృష్టిలో పెట్టుకుని ఆర్‌అండ్‌బీ, ట్రాన్స్‌కో అధికా రులు సర్వసన్నద్ధంగా ఉండాలన్నారు. కమ్యూనికేషన్ నెట్‌వర్క్ నిరంతరాయంగా ఉండేలా జనరేటర్లను డీజిల్ ఇంధనంతో సిద్ధంచేయాలన్నారు. తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో మండల స్థాయి స్టాక్ పాయింట్లు వద్ద నిత్యావసరాలు అందుబాటులో ఉంచాలన్నారు. వరి పంట కోతకు సిద్ధంగా ఉందని, కళ్లాల్లో ఆరబోసిన ధాన్యాన్ని వెంటనే రైసు మిల్లులకు తరలించేందుకు ఏర్పాట్లు చేపట్టామన్నారు.
*తీరగ్రామాల ప్రజల్ని సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు తగిన చర్యలు తీసుకోవాలని అధికారుల్ని సీఎం జగన్ ఆదేశించిన్నట్లు తెలిపారు . తుఫాన్ పరిస్థితిపై కలెక్టర్ వెంకట రమణ రెడ్డి అధికారుల నుంచి వివరాలు తీసుకున్నారు అనీ చెప్పారు . సహాయ పునరావాస కార్యక్రమాల అమలుకు అధికారులు సర్వసన్నద్ధంగా ఉండాలని.. విద్యుత్తు, రవాణా వ్యవస్థలకు అంతరాయం ఏర్పడితే.. పునరుద్ధరణకు వెంటనే చర్యలు తీసుకోవాలన్నారు. అవసరమైన చోట సహాయశిబిరాలు ఏర్పాటు చేసుకోవాలన్నారు. రక్షిత తాగునీరు, ఆహారం, పాలు అందుబాటులో ఉంచాలని సూచించారు.*
*తిరుపతి జిల్లా కలెక్టర్ వెంకట రమణ రెడ్డి ఆదేశాల మేరకు మిచంగ్ తుఫాన్ కారణంగా శనివారం నుండి కురుస్తున్న భారీ వర్షాలు వలన గూడూరు డివిజన్ లోని లోతట్టు ప్రాంతాలను జాయింట్ కలెక్టర్ డీ కె బాలాజీ రెవెన్యూ డివిజనల్ అధికారి ఎం కిరణ్ కుమార్ ల ఆధ్వర్యంలో డివిజన్ స్థాయి మరియు మండల స్థాయి అధికారులతో కలిసి చిల్లకూరు మండలం తిప్పగుంటపాలెం గ్రామానికి వెళ్లే దారి మార్గములో ఉన్న ఉప్పుటేరును పరిశీలించారు.*
*గూడూరు రూరల్ మండలం,తిప్పగుంటపాలెం గ్రామం లో జాయింట్ కలెక్టర్, ఆర్డివో లు సందర్శించి అక్కడ గ్రామస్థులతో మాట్లాడి రేషన్ పంపిణీ పూర్తి స్థాయిలో అందుతున్నాయా లేద అనీ ప్రజలను అడిగి తెలుసుకున్నారు. గ్రామములో విద్యుత్ అంతరాయం వలన తాగునీరు సమస్య రాకుండా ఎప్పటికప్పుడు ఓవర్ హెడ్ ట్యాంక్ ను ఫుల్ చేసుకునేలా ఆర్డబ్ల్యూఎస్ శాఖ అధికారులకు ఆదేశాలు ఇచ్చారు.గర్భిణీలు మరియు రోగులకు ఎటువంటి ఆపద కలగకుండ ముందస్తు జాగ్రత్తలు తీసుకునేలా అధికారులకు పలు సూచనలు చేశారు. పూరీ గుడిసె లు పడిపోయే దశలో ఉన్న వాటిని గుర్తించి వారిని రి-హాబీటేషన్ కేంద్రాలలో ఉంచవలసినదిగా కోరారు. ఎలాంటి ప్రాణ నష్టం, ప్రమాదములు జరగకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకునేలా మండల అధికారులకు సూచించారు.*
*కోట మండలం లో..*
*కోట మండలం గోవిందపల్లి పాళెం నందు సముద్రపు ఒడ్డున ఉన్న లంగరు వేయు ప్రాంతమును జీసి, ఆర్డివో లు పరిశీలించి సముద్రపు ఆటు పోటులను గమనించారు. తర్వాత అక్కడ గ్రామస్థులతో మాట్లాడి రేషన్ పంపిణీ పూర్తి స్థాయిలో జరిగినదా లేదా అనీ ప్రజలను అడిగి తెలుసుకున్నారు. గ్రామములో విద్యుత్ అంతరాయం వలన తాగునీరు సమస్య రాకుండా ఎప్పటికప్పుడు ఓవర్ హెడ్ ట్యాంక్ ను ఫుల్ చేసుకునేలా ఆర్డబ్ల్యూఎస్ శాఖ అధికారులకు ఆదేశించారు, గర్భిణీలు మరియు రోగులకు ఎటువంటి ఆపద కలగకుండ ముందస్తు జాగ్రత్తలు తీసుకునేలా అధికారులకు సూచించారు. పూరీ గుడిశెలు పడిపోయే దశలో ఉన్నవి గుర్తించి వారిని రి-హాబీటేషన్ కేంద్రాలలో ఉంచవలసినదిగా, ఎలాంటి ప్రాణ నష్టం, ప్రమాదములు జరగకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకునేలా మండల అధికారులకు సూచించారు. గ్రామ రోడ్లు వెంబడి కాలినడకన గ్రామ పరిసరాలను గమనించి, గ్రామము నందు గల అందరూ మత్స్య కారులను తుఫాన్ షెల్టర్ లో సమావేశపరచి వారితో మాట్లాడి ఎవరు సముద్రములోకి వేటకు వెళ్లకూడదు అనీయు, ఎవరైనా వెళ్ళి ఉంటే వెంటనే ఒడ్డుకు రమ్మనవలసినదిగా వారిని కోరారు.*
*వాకాడు లో..*
*వాకాడు మండలం బాలిరెడ్డిపాలెం నుండి గంగన్న పాలెం గ్రామానికి వెళ్లే రహదారి మార్గం లో ఉన్న స్వర్ణముఖి నది పై గల బ్రిడ్జి ని జీసి, ఆర్డివో లు పరిశీలించారు, వర్షము పెరిగిన కొలది నీటి ప్రవాహం పెరిగితే బ్రిడ్జి పై నీరు అధికమైనప్పుడు గ్రామస్తులు ఎవరు బ్రిడ్జిని దాటకుండా రెండు వైపులా కంప చెట్లను వేసి పోలీస్ మరియు రెవెన్యూ శాఖ వారు అప్రమత్తముగా ఉండాలని ఆదేశాలు ఇచ్చారు.ఎలాంటి ప్రాణ నష్టం , ప్రమాదములు జరగకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకునేలా ఆర్ అండ్ బి అధికారులకు పోలీస్ మరియు రెవెన్యూ శాఖ అధికారులకు వారు సూచించారు.*
*స్వర్ణముఖి బ్యారేజినీ పరిశీలించిన ఆర్డివో కిరణ్ కుమార్*
*వాకాడు మండలం, వాకాడు గ్రామం స్వర్ణముఖి బ్యారేజినీ వాకాడు మండల అధికారులతో కలిసి ఆర్డివో కిరణ్ కుమార్ పరిశీలించారు. బ్యారేజి నందు గల నీటిమట్టం ను పరిశీలించి అందులో గల 34 గెట్లలో 4 గెట్లుకు థ్రెడ్ లు తెగిపోయి ఉన్నవని, 3 గేట్లు పూర్తిగా ఉపయోగంలో లేవని గుర్తించారు.. సదరు విషయమై 7 గేట్లు పై సవివరమైన నివేదికను జిల్లా కలెక్టరుకి సమర్పిస్తామని ఆర్డివో తెలిపారు.*
*తిప్పగుంటపాలెంలో భోజనాలు ఏర్పాటు చేసిన ఆర్డివో కిరణ్ కుమార్*
*చిల్లకూరు మండలం , తిప్పగుంటపాళెం గ్రామంలో గ్రామం లోని 61 మంది యస్.టి.కాలనీ వాసులకు ప్రాధమిక పాఠశాల నందు ఏర్పాటు చేసిన రీ హాబిటేషన్ సెంటర్ ను గూడూరు రెవెన్యూ డివిజనల్ అధికారి ఎం. కిరణ్ కుమార్ మండల అధికారులతో కలసి పరిశీలించారు, వారికి స్వయంగా రాత్రి ఆహారాన్ని వడ్డించారు, వారితో మాట్లాడి అక్కడ అధికారులు చేసిన సౌకర్యాలను అడిగి తెలుసుకున్నారు, వారికి ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఏ.యన్.యం.ను అందుబాటులో ఉంచమని అధికారులకు సూచనలు చేశారు వారి వెంట మండల స్పెషల్ ఆఫీసర్ డి.డి.సోషల్ వెల్ఫేర్, మండల తహశీల్దార్, మండల అభివృద్ధి అధికారి తదితరులు ఉన్నారు.*