Advertisements

ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలి, మాజీ ఎమ్మెల్యే సునీల్ కుమార్

ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలి,భారీ నుంచి అతిభారీ వర్షాలు ఉన్నందున అధికారులు ముందస్తు చేపట్టాలని మనవి- మాజీ శాసన సభ్యులు పాశిం సునీల్ కుమార్ గారు…

తుఫాను ప్రభావం ఎక్కువగా ఉంటుందని వాతావరణ శాఖ జారీ చేసుందని, జిల్లా వ్యాప్తంగా హై అలెర్ట్ ప్రకటించి ఉన్నందున ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలి.

అవసరమైతే తప్ప ప్రజలు బయటకు రావొద్దని అన్నారు.

వర్షాలు తగ్గే వరకు మన జాగ్రత్తలలో మనం ఉండాలని అన్నారు.

ముఖ్యంగా తీర ప్రాంత ప్రజలు, లోతట్టు ప్రాంతాలలో ఉన్నవారు జాగ్రత్త వహించాలని అన్నారు.

జిల్లాలో హై అలెర్ట్ ఉన్నందున అధికారులు పునరావస కేంద్రాలను ఏర్పాటు చేసి, అన్ని వసతులు ఏర్పాటు చేయాలని అన్నారు.

తీరప్రాంత ప్రజలను పునరావస కేంద్రాలకు తరలించాలని అన్నారు.

తుఫాను ప్రభావం కారణంగా ఎలాంటి ప్రాణ నష్టం జరగకుండా అధికారులు ముందస్తు చర్యలు తీసుకోవాలని అన్నారు.

ఈ వర్షాల వలన ప్రజలు ఇబ్బందులు పడుతుంటే పార్టీ నాయకులు కార్యకర్తలు అందుబాటులో ఉండి వారికి సహాయ సహకారాలు అందించాలని అన్నారు

Leave a Comment