ఏర్పేడు (డిసెంబర్2): ఏర్పేడు మండలం, పాత వీరాపురం గ్రామానికి మల్లెమడుగు నీళ్లు… మల్లెమడుగు డ్యామ్ నుంచి పాత వీరాపురం గ్రామానికి నీళ్లు వెళ్లే పెద్ద కాలువను మెగా కంపెనీ వారు పూడ్చివేయటంతో తుఫాను వర్షానికి ఎలాంటి నీరు చెరువుకు చేరలేదు .సర్పంచ్ పోతుగుంట. గురవారెడ్డి ఎమ్మెల్యే మధుసూదన్నకు తెలియజేయడంతో వెంటనే స్పందించి మెగా కంపెనీ వారితో మాట్లాడి జెసిబి సహాయంతో ఏర్పేడు మండల వైసీపీ ఇన్చార్జి కిషోర్ కుమార్ రెడ్డి ఆదేశానుసారం మంగళవారం కాలువను బాగు చేసి యధాతధనం చేసి మల్లెమడుగు డ్యాం నీరును పాతవిరాపురం గ్రామ చెరువుకు మళ్ళించడం జరిగింది. గ్రామ ప్రజలు ఎమ్మెల్యేకు రుణపడి ఉంటామని, కిషోర్ రెడ్డికి కృతజ్ఞతలు తెలియజేశారు.