Advertisements

దొరవారి సత్రం పోలీస్ స్టేషన్ ను SP తనిఖీ…

దొరవారిసత్రం పోలీస్ స్టేషన్ లో తిరుపతి
జిల్లా ఎస్పీ పి. పరమేశ్వర్ రెడ్డి శనివారం తనిఖీ
నిర్వహించి పలు రికార్డులను పరిశీలించారు.
జాతీయ రహదారి పై ప్రమాదాల నివారణకు చర్యలు
చేపట్టాలని ఆదేశించారు. మద్యం సేవించి వాహనాలు
నడిపే వారిని గుర్తించి కేసులు నమోదు చేయాలని
సూచించారు.భద్రతా ప్రమాణాలను పటిష్టంగా అమలు చేయాలనిజిల్లా ఎస్పీ పరమేశ్వర్ రెడ్డి తెలియచేశారు.రానున్న ఎన్నికల నేపధ్యంలో భద్రతా ప్రమాణాలను మెరుగుపరచడం ద్వారా మరింత పటిష్టమైన భద్రతా ఏర్పాటు చర్యలను చేపట్టడం జరుగుతుందని తిరుపతి జిల్లా ఎస్పీ పరమేశ్వర్ రెడ్డి పేర్కోన్నారు.నమోదైన కేసుల వివరాలు, పెండింగ్ లో ఉన్న కేసుల ధర్యాప్తు వివరాలకు సంబంధించిన రికార్డులను పరిశీలించిన ఆయన, కేసుల పురోగతిపై సిఐ సోమయ్య ని ఆరా తీశారు.ఈ కార్యక్రమంలో డీఎస్పీ రాజగోపాల్ రెడ్డి ఎస్ఐ తిరుమలరావు మరియు సిబ్బంది పాల్గోన్నారు.

Leave a Comment