(అసిస్టెంట్ ఓటరు నమోదు అధికారి గూడూరు
బాల లీలా రాణి.)
1) భారత ఎన్నికల కమిషన్ యొక్క ఆదేశాల మేరకు, 02.12.2023 (శనివారం) మరియు 03.12.2023 (ఆదివారం) తేదీలలో Special Campaign Days నిర్వహించడం జరుగుతుంది. కావున 120-గూడూరు (SC) నియోజకవర్గములోని గూడూరు మండలములోని ఓటర్లు తమ యొక్క ఓటు ను జాబితాలో తెలుసుకోవడానికి మరియు మార్పులు చేసుకోవడానికి సంబంధిత BLO (Booth Level Officers గూడూరు మండలములోని 111 పోలింగ్ కేంద్రాలలో అందుబాటు లో ఉంటారు.
2) ప్రత్యేక సంక్షిప్త సవరణ జాబితా 2024 యొక్క ముసాయిదా ఓటర్ల జాబితా 120-గూడూరు (SC) నియోజక వర్గం సంబందించి 111 పోలింగ్ కేంద్రాల వివరములు మరియు ఓటర్ల వివరములు 27. 10, 2023 తేదీ న ఓటర్ల యెరుక నిమిత్తము భారత ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు ప్రచురించడమైనది.
3) ప్రతి ఓటరు సంబంధిత పోలింగ్ కేంద్రాలలో ఉన్న బూత్ లెవెల్ ఆఫీసరు ద్వారా తనిఖీ చేసుకోగలరు.
4) ఓటర్ల జాబితా లో పేరు లేని యెడల ఫారం-6 ను పూరించి దరఖాస్తు చేసుకొనవలెను
5) ఓటర్ల జాబితాలో ఓటరు వివరములు సవరించిన యెడల ఫారం-8 దరఖాస్తు చేసుకొనవలెను.
6) ఓటరు జాబితా లో చనిపోయిన వారు నమోదు అయినచో అలాంటి ఓటరును తొలగించుటకు ఫారం- 7 ధరఖాస్తు చేసుకొనవలెను.
7) 01.01.2024 నాటికి 18 సం|| లు వయస్సు నిండిన ప్రతి ఒక్కరు ఓటరు నమోదు కొరకు ఫారం-6 Voter Helpline App ຽ, https://voters.eci.gov.in/ ໖ మరియు దగ్గరలోని ఏరియా బూత్ లెవెల్ ఆఫీసర్ (BLO) ద్వారా కానీ దరఖాస్తు చేసుకోవచ్చు. ,
8) సదరు ఓటర్ల వివరములు ECI వెబ్ సైట్ https://voters.eci.gov.in/ నందు అందుబాటులో ఉన్నాయి. కావున ఓటర్లు అందరు ఈ వెబ్ సైట్ నందు మీ యొక్క పేరు ముసాయిదా ఓటర్ల జాబితాలో ఉన్నదో లేదో సరి చూసుకోవలసిందిగా కోరడమైనది.
9) ఓటరుగా నమోదు అయిన వారు e-EPIC (ఓటర్ ID) కార్డును Voter Helpline App మరియు https://voters.eci.gov.in/ వెబ్ సైట్ ద్వారా కానీ డౌన్లోడ్ చేసుకొని ఉపయోగించు కోవచ్చు.
10) అన్నీ గుర్తింపు పొందిన రాజకీయ పార్టీలకు సంబంధించిన బూత్ లెవల్ ఏజెంట్స్ కూడా సంబంధిత పోలింగ్ కేంద్రాల ఓటర్స్ లిస్ట్ ను పరిశీలించి ఏదైనా సందేహాలు ఉన్న తెలుపవలసిందిగా కోరడమైనది.
అసిస్టెంట్ ఓటరు నమోదు అధికారి గూడూరు
బాల లీలా రాణి.✍️