Advertisements

గూడూరు లో జగనన్న భూ పంపిణీ

ప్రజా సంక్షేమమే వైసీపీ ప్రభుత్వ ధ్యేయం
పేద రైతులకు భూ హక్కు కల్పించడమే ముఖ్యమంత్రి లక్ష్యం
ఎమ్మెల్యే వరప్రసాదరావు


పేద రైతులకు అండగా వైసీపీ ప్రభుత్వం
ఎమ్మెల్సీ బల్లి కళ్యాణ్ చక్రవర్తి


గూడూరు ఆర్డీఓ గా భూ పంపిణీ చేయడం ఆనందదాయకం
ఆర్డీఓ కిరణ్ కుమార్

పేద ప్రజల సంక్షేమమే వైసీపీ ప్రభుత్వ ధ్యేయమని అందులో భాగంగా సాగు చేసుకునే భూమిపై పేద రైతులకు హక్కు కల్పించి కల్పించి రైతుల హృదయాల్లో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నిలిచిపోయారని గూడూరు ఎమ్మెల్యే డాక్టర్ వరప్రసాదరావు పేర్కొన్నారు. గురువారం స్థానిక డిఎన్ఆర్ కమ్యూనిటీ హాల్లో భూమి సాగు చేసుకునే పేద రైతులకు భూపట్టాల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే వరప్రసాద్ రావు, ఎమ్మెల్సీ బల్లి కళ్యాణ్ చక్రవర్తి, డీ అర్వో పెంచల్ కిషోర్,ఆర్డీఓ కిరణ్ కుమార్ ల చేతుల మీదుగా భూమి సాగు చేసుకునే పేద రైతులకు పట్టాల పట్టాల పంపణీ కార్యక్రమాన్ని చేపట్టారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రాష్ట్రంలో ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా ఎన్నికల్లో ఇచ్చిన హామీలను 100% అమలుపరచిన ఘనత మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కే దక్కుతుందన్నారు. రాష్ట్రంలో అన్ని వర్గాల సంక్షేమానికి అనేక పథకాలుపొందించారన్నారు.

ఆ క్రమంలో రాష్ట్రంలో ఇప్పటివరకు చేయని విధంగా భూమి సాగు చేసుకునే పేద రైతులకు ఒక్క సంతకం తోనే చుక్కల భూములు, అసైన్మెంట్ భూములపై నిషేధం తొలగించి హక్కులు కల్పించారన్నారు. దీంతో పేద రైతుల కళ్ళల్లో ఆనందాన్ని ముఖ్యమంత్రి చూశారన్నారు. ఎమ్మెల్సీ మాట్లాడుతూ గూడూరు నియోజకవర్గంలో తన తండ్రి దివంగత మంత్రి బల్లి దుర్గ ప్రసాద్ హాయంలో భూ పంపిణీ కార్యక్రమం జరిగిందని తిరిగి అనేక సంవత్సరాల తర్వాత అసైన్మెంట్ భూములకు పట్టాలు కల్పించిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అన్నారు. రాబోయే ఎన్నికల్లో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీని ఆదరించి తిరిగి జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిగా చేసుకోవాలని పిలుపునిచ్చారు. డిఆర్ఓ పెంచల కిషోర్ మాట్లాడుతూ అసైన్మెంట్ భూ పంపిణీ కార్యక్రమం పేద రైతులకు ఒక వరం లాంటిదని దానిపై పూర్తి పూర్తి హక్కులు కల్పించి పట్టాలు మంజూరు చేసి ప్రభుత్వం ఆస్తి కల్పించిందన్నారు.ఆర్డీవో కిరణ్ కుమార్ మాట్లాడుతూ12 సంవత్సరాల అనంతరం పేదలకు భూ పంపిణీ కార్యక్రమం నిర్వహించడం ఆనందంగా ఉందని తెలిపారు. తాసిల్దారుగా పనిచేస్తున్న సమయంలో 7 విడుదలగా భూ పంపిణీ కార్యక్రమం ద్వారా 4500 మందికి పట్టాలు ఇవ్వడం జరిగిందని తిరిగి ఇప్పుడు భూ పంపిణీ చేయడం తన చేతుల మీదగా జరగడం ఆనందంగా ఉందని తెలిపారు. గూడూరు నియోజకవర్గంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర సీఈసీ సభ్యులు ఎల్లసిరి గోపాల్ రెడ్డి మాట్లాడుతూ దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి తనయుడుగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఎస్సీ ఎస్టీ బీసీల సంక్షేమ ధ్యేయంగా పాలన సాగిస్తూ అర్హులైన పేద రైతులకు భూపట్టాల కల్పించి వారి హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయారు అన్నారు. ఈ కార్యక్రమంలో వాకాడు పార్టీ మండల కన్వీనర్ నేదురమల్లి రంజన్ రెడ్డి,గూడూరు పట్టణ వైసీపీ అధ్యక్షులు బొమ్మిడి శ్రీనివాసులు, గూడూరు చిల్లకూరు వాకాడు ,చిట్టమూరు జడ్పీటీసీలు ఊటుకూరు యామిని, మన్నెం శ్రీనివాసులు, రైతు రామకృష్ణ, గూడూరు ఎంపీపీ గురవయ్య,కోట ఎంపిటిసి మోభీన్ బాషా,వైసిపి నాయకులు కోడూరు మీరారెడ్డి,కొండూరు సునీల్ కుమార్ రెడ్డి, మహేంద్ర యాదవ్, వంకా వెంకటరమణయ్య, నియోజకవర్గంలోని ప్రజాప్రతినిధులు, తహశీల్దార్లు,రెవెన్యూ అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Leave a Comment