ఏర్పేడు (నవంబర్ 30): చేతి బోర్లు వద్ద పరిసరాలు శుభ్రంగా ఉంచుకోవాలి:సర్పంచ్ మోహన ప్రియ …
ఏర్పేడు మండలం యం. డి. పుత్తూరు గ్రామంలో రెండురోజులుగా కురుస్తున్న వర్షాల కారణంగా గ్రామస్తుల సమస్యలను తెలుసుకొనుటకు సర్పంచ్ మోహన ప్రియ సచివాలయ సిబ్బందితో కలిసి గ్రామంలో పర్యటించారు. వర్షానికి రోడ్లపై నిల్వ ఉన్న నీటిని పారిశుద్ధ్య కార్మికుల ద్వారా తొలిగింపుచేయించారు.త్రాగు నీటి బోరు వద్ద అపరిశుభ్రంగా ఉండటాన్ని గుర్తించి గ్రామస్తులతో బోరు వద్ద పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలని పేడతట్టలు కడగటం గుడ్డలు ఉతకడం తదితర పనులు చేయకూడదని తెలియపరిచారు.త్రాగునీటి బోరు వద్ద సిమెంట్ వర్రలు ఏర్పాటు చేయించాలని గ్రామస్తులు కోరగా అధికారులతో సంప్రదించి తగిన ఏర్పాట్లు చేయిస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో కార్యదర్శి లోకముని, మహిళ సంరక్షణ కార్యదర్శి ప్రియదర్శిని, అగ్రికల్చిరల్ అసిస్టెంట్ భారతి, ఇంజనీరింగ్ అసిస్టెంట్ వినోద్ గ్రామస్తులు పాల్గొన్నారు.