తిరుపతి జిల్లా, కోట మండలం, కోట పట్టణం ఆకు తోట విధికి చెందిన దివ్యంగులు గూడూరు కృష్ణ కు డేరింగ్ అండ్ డైనమిక్ అధికారి, ప్రజాఅధికారి, మానవతావాది గూడూరు రెవిన్యూ డివిజనల్ అధికారి (ఆర్ డీ వో )కుమార్ అండగా నిలిచి 10వేల రూపాయలు ఆర్థిక సాయం అందజేశారు. దింతో దివ్యంగులు కృష్ణ హర్షం వ్యక్తం చేసి ఆర్డివో చేసిన సహాయం కు ఎల్లప్పుడూ రుణపడి ఉంటాను అనీ తెలిపారు.పూర్తి వివరాలు మేరకు రెండు సంవత్సరాల క్రితం కోట గ్రామ పంచాయతీ కార్యాలయం ఎదుట ఉన్న రెండు దుకాణాలు తిరుములశెట్టి కోటేశ్వరరావు వేలం పాట పాడి దుకాణాలు దక్కించుకున్నారు. కానీ అప్పటికే గతంలో దుకాణాలు వేలం పాడిన వారు 10వేల రూపాయలు వరకు కరెంట్ బిల్లులుచెల్లించలేదు.తిరుములశెట్టి కోటేశ్వరరావు తాను పాడుకొన్న రెండు దుకాణాలు దివ్యంగులైన గూడూరు కృష్ణ కు లీజుకు ఇవ్వడం జరిగింది.*ఈ లోపు విద్యుత్ శాఖ అధికారులు విద్యుత్ బకాయిలు చెల్లించలేదు అనీ గూడూరు కృష్ణ నిర్వహిస్తున్న రెండు దుకాణాలకు కరెంట్ కట్ చేశారు. దింతో దివ్యంగులు గూడూరు కృష్ణ అప్పటి పంచాయతీ కార్యదర్శి నీ కలిసి జరిగిన విషయాలు చెప్పడం తో అప్పుడు ఉన్న పంచాయతీ కార్యదర్శి ప్రస్తుతం మీరు విద్యుత్ బకాయిలు చెల్లించుకోండి. కొద్దీ రోజుల్లో అ కరెంట్ బిల్లు అమౌంట్ పంచాయతీ తరుపున ఇస్తామని హామీ ఇచ్చారు.*ఇంతలో పంచాయతీ కార్యదర్శి బదిలీ కావడం వెను వెంటనే వేలం పాటలు జరిగి వేరే వారు వేలం పాటలో దుకాణాలు దక్కించుకున్నారు. తరువాత దివ్యంగులు కృష్ణ ప్రస్తుతం ఉన్న పంచాయతీ కార్యదర్శి శ్రీనివాసులు దగ్గర కు వెళ్లి జరిగిన విషయాలు చెప్పి తనకు రావలసిన కరెంట్ బకాయిలు 10వేల రూపాయలు ఇవ్వాలని కోరారు. చూస్తాం అనీ చెప్పి అయన ఇవ్వలేదు. తరువాత ఎంతోమంది రాజకీయ నాయుకులను కలిసి న్యాయం చేయాలనీ ప్రాధేయపడ్డ దివ్యంగులు కృష్ణ కు న్యాయం చేయలేదు.*తరువాత గూడూరు ఆర్డివో కిరణ్ కుమార్ ను దివ్యంగులు గూడూరు కృష్ణ కలిసి తన ఆవేదన, బాధను చెప్పుకొని న్యాయం చేయాలనీ వేడుకున్నారు. వెంటనే స్పందించిన ఆర్డివో కిరణ్ కుమార్ 10వేల రూపాయలు ఆర్ధిక సహాయం బుధవారం రాత్రి గూడూరు ఆర్డివో కార్యాలయం లో అందజేసిన ఆర్డివో దాతృత్వంచాటారు.ఈసందర్బంగా కృష్ణ మాట్లాడుతూ దివ్యంగలైన తనకు ఎవ్వరు సహాయం చేయలేదు. అధికారులు,ప్రజా ప్రతినిధులు చుట్టూ తిరిగిన న్యాయం చేయలేదు. ఆర్డివో నా బాధలు గుర్తించి న్యాయం చేశారు అనీ ఆర్డివో కి ఎల్లప్పుడూ రుణపడి ఉంటాను అనీ తెలిపారు.