Advertisements

సంతృప్తి చెందేలా రేషన్ పంపిణీ జరగాలి

తిరుపతి కలెక్టరేట్ లో జిల్లాలోని తహసిల్దార్లతో , పౌరసరఫరాల శాఖ అధికారులు మరియు జెసి డి కె బాలాజీ, ఆర్డివో కిరణ్ కుమార్ లతో కమిషనర్ సమీక్ష సమావేశం.

ఆహార భద్రత చట్టాన్ని గౌవరిస్తూ కార్డు దారులకు రేషన్ పంపిణీ సకాలంలో జరిగేలా చూడాల్సిన బాధ్యత అధికారులు పై వుందని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ కమిషనర్ అరుణ్ కుమార్ సూచించారు. బుధవారం తిరుపతి కలెక్టరేట్ లో జిల్లాలోని తహసిల్దార్లు , పౌరసరఫరాల శాఖ అధికారులు,జెసి డి కె బాలాజీ, గూడూరు ఆర్డివో కిరణ్ కుమార్ ల తో కలసి కమిషనర్ అరుణ్ కుమార్ సమీక్ష సమావేశం నిర్వహించారు.ఈ సమావేశం లో కమిషనర్ అరుణ కుమార్ మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందిస్తున్న రేషన్ సకాలంలో అందించాలని, అది కుడా పారదర్శకత వుండాలని సూచించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వై ఎస్ జగన్మోహన్ రెడ్డి స్వయంగా రేషన్ కష్టాలు చూసిన మేరకు 2020 సంవత్సరం నుండి రేషన్ పంపిణీ లబ్దిదారులకు దగ్గరగా అందాలని మొబైల్ డిస్పెన్స్ వాహనాలు ప్రవేశ పెట్టడం జరిగిందని అన్నారు.రానున్న డిసెంబర్ నుండి పగద్భందీగా రేషన్ సరఫరాకు కోసం వాలింటర్ లకు ఎం డి యు వాహనాల ద్వారా పంపిణీ ప్రదేశాల వివరాలు పంపాలని , పంపిణీ రోజు తప్పనిసరి వాలింటర్ దగ్గరుండి భాద్యతగా పారదర్శకంగా సరఫరా జరిగేలా చూడాలని అన్నారు. ప్రతి నెలా పంపిణీ 1 నుండే ప్రారంభం కావాలని, 17 నాటికి పూర్తి చేయాలని అన్నారు.ప్రతి నెలా తహసిల్దార్లు పంపిణీ పై ఎం.డి.యు ఆపరేటర్లతో, వాలింటర్ల తో కోఆర్డి నేషన్ మీటింగ్ జరపాలని, కచ్చితంగా ఏరోజు, ఏసమయం పంపిణీ వివరాలు ప్రజలకు ఒక రోజు ముందే తెపాలని అన్నారు. లబ్దిదారులు ఎక్కువగా కూలీలు ఉంటారని వారికి అనుకూల సమయంలో అందించేవిధంగా చూడాలని అన్నారు. డిసెంబర్ నుండి కేజీ రాగి (మిల్లెట్ల్స్)అందిస్తున్నామని , ఆరోగ్యపరంగా మంచిదని అన్నారు. మనం బియ్యం (సార్టేక్స్)సరఫరా చేస్తున్నామని ఆరోగ్యానికి మంచిదని తెలపాలని , ప్రక్కదోవ పట్టరాదని విజిలెన్స్ నిఘా వుండాలని, తరచూ ఆర్దిఒ లు, డిప్యూటి కలెక్టర్లు, తహసిల్దార్లు, తూనికలు, కొలతుల శాఖ తనిఖీలు నిర్వహించాలని సూచించారు.ఎం.డి.యు ఆపరేటర్లు నిలిచిపోతే రెండు నెలల్లో నియమించాలని, ప్రస్తుతం వాహన మిత్ర కూడా అందిస్తున్నామని , ఆపరేటర్లు ఒక మంచి పని పేదలకు అందిస్తున్న రేషన్ అనే బావన వుండాలని కోరారు. ఎక్కడైనా రిమార్క్ వస్తే సంబంధిత అధికారులు చర్యలు చేపట్టాలని ఆదేశాలుజారీచేశారు.అనంతరం జె సి బాలాజీ పలు సూచనలు సలహాలు సూచించారు.ఈ సమావేశం లో జెసి బాలాజీ గూడూరు ఆర్దిఒ కిరణ్ కుమార్ , పౌరసరఫరాల అధికారి రాజ రఘువీర్ , డి ఎం సివిల్ సప్లె సుమతి, డిటిలు , తహసిల్దార్లు పాల్గొన్నారు.

Leave a Comment