జగనన్న భూ పంపిణీ కార్యక్రమంలో వెంకటగిరి డక్కిలి బాలాయపల్లి మండలాలకు సంబంధించి అర్హులైన లబ్ధిదారులకు వెంకటగిరి నియోజకవర్గ సమన్వయకర్త నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి అధ్యక్షతన గూడూరు రెవిన్యూ డివిజనల్ అధికారి ఎం కిరణ్ కుమార్
ఆధ్వర్యంలో వెంకటగిరి పట్టణంలోని ఎస్ ఆర్ ఎల్ కన్వెన్షన్ హాల్లో ఏర్పాటుచేసిన సమావేశంలో పట్టాలు అందజేశారు వీటితోపాటు అర్హులైన వారికి జనవరి మాసం 2024 నాటికి సంక్రాంతి కానుకగా రెండువేల మంది లబ్ధిదారులకు భూ పంపిణీ కార్యక్రమం నిర్వహించమని నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి సూచనలతో మండలాల తాసిల్దారులతో సమీక్ష సమావేశాన్ని నిర్వహించిన రెవెన్యూ డివిజనల్ అధికారి నేటి నుంచి సంక్రాంతికి అందించే భూ పంపిణీ కానుకలను రెవిన్యూ యంత్రాంగంతో చర్చించి పావులు కలిపారు ఈ కార్యక్రమంలో మూడు మండలాల వైసీపీ నాయకులు తాసిల్దారులు శ్రీనివాసులు రమేష్ పద్మావతి తో పాటు రెవెన్యూ సర్వేయర్లు ఇన్స్పెక్టర్లు వీఆర్వోలు లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు