భారతదేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కి స్వాగతం పలికేందుకు తిరుపతికి విచ్చేసిన రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తిరుపతి జిల్లా రేణిగుంట ఎయిర్ పోర్ట్ లో తూర్పు రాయలసీమ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ పర్వత రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి కలిశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్సీ పర్వత రెడ్డి చంద్రశేఖర్ రెడ్డిని ముఖ్యమంత్రి గారు ఆప్యాయంగా పలకరించి పలు రాజకీయ అంశాలను గురించి అడిగారు .
ఇటీవల ప్రభుత్వ ప్రైవేటు విద్యాసంస్థలు, ఉపాధ్యాయులకు మేలు జరిగేలా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీసుకున్న నిర్ణయాల పట్ల ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి సీఎం కి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు.