Advertisements

సమస్యను పరిష్కరించిన అధికారులుకు ధన్యవాదాలు తెలిపిన,
మాజీ కౌన్సిలర్ మరియు తెలుగు దేశం పార్టీ క్రిస్టియన్ సెల్ అధ్యక్షుడు తాతపూడి ఇశ్రాయేల్ కుమార్

ఒకటో పట్టణం నుండి 2వ పట్టణంనకు  రైల్వే ఫుట్ ఓవర్ బ్రిడ్జి మీదుగా కాలినడకన రాకపోకలు సాగించేందుకు అడ్డుగా ఉన్న గోడను తొలగించి మార్గాన్ని ఏర్పరిచిన సంబంధిత అధికారులకు
మాజీ కౌన్సిలర్ మరియు తెలుగు దేశం పార్టీ క్రిస్టియన్ సెల్ అధ్యక్షుడు తాతపూడి ఇశ్రాయేల్ కుమార్ ధన్యవాదములు తెలపారు. ఒకటో పట్టణం నుండి రెండవ పట్టణానికి రాకపోకలు కొనసాగించేందుకు గూడూరు రైల్వే స్టేషన్ ఒకటవ ప్లాట్ ఫాం వద్ద ఉన్న మార్గాన్ని గత కొంతకాలం క్రితం రైల్వే శాఖ అధికారులు అడ్డంగా గోడ నిర్మించి మూసివేయడంతో పట్టణ ప్రజలకు నడకమార్గం సాగిందించేందుకు చుట్టూ తిరిగి వెళ్ళడానికి  చాలా ఇబ్బందులు పడుతున్నారు.  ఈ నేపథ్యంలో ఈ విషయం గమనించిన తెలుగుదేశం పార్టీ, సిపిఐ పార్టీలు అడ్డుగా నిర్మించిన గోడను తొలగించాలని గత నెల 30వ తారీఖున ఆర్డీవో గారిని కలిసి సంబంధిత రైల్వే శాఖ అధికారులతో చర్చించి అక్కడ మార్గము ఏర్పాటు చేయాలని వినతి పత్రం ఇవ్వడం జరిగింది. దీనిపై స్పందించిన సంబంధిత అధికారులు అడ్డుగా నిర్మించిన గోడను పగలకొట్టి పట్టణ ప్రజలు ఫుట్ ఓవర్ బ్రిడ్జిపై రాకపోకలు కొనసాగించేందుకు అక్కడ మార్గాన్ని ఏర్పరచడంతో పట్టణ ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా మాజీ కౌన్సిలర్ తిరుపతి పార్లమెంట్ క్రిస్టియన్ సెల్ అధ్యక్షుడు మాట్లాడుతూ గూడూరు పట్టణంలో నెలకొన్న ప్రధాన సమస్యలను ఆర్డిఓ గారి దృష్టికి తీసుకెళ్లే క్రమంలో  రైల్వే స్టేషన్ ఒకటవ ఫ్లాట్ ఫాం వద్ద అడ్డుగా గోడను నిర్మించినందున పట్టణ ప్రజలు రాకపోకల కొనసాగించేందుకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, ఇక్కడ పట్టణ ప్రజలు రాకపోకలు కొనసాగించేందుకు మార్గం ఏర్పాటు చేయాలని ఆయనకు విన్నవించామని, ఆయన వెంటనే ఈ సమస్య పరిష్కరిస్తామని హామీ ఇచ్చారని,  దీనికి స్పందించిన సంబంధిత రైల్వే శాఖ అధికారులు పట్టణ ప్రజలు సౌకర్యార్ధం అక్కడ మార్గం ఏర్పాటు చేయడం సంతోషదాయకమని ఇక్కడ  మార్గం ఏర్పాటు చేసినందుకు పట్టణ ప్రజలు తరపున, తెలుగుదేశం పార్టీ,, సిపిఐ పార్టీల తరఫున స్పందించిన అధికారులకు ధన్యవాదాలు తెలియజేస్తున్నామని అన్నారు.

అలాగే మున్సిపల్ స్పెషల్ ఆఫీసర్ అయిన ఆర్డీవో  పట్టణంలో నెలకొన్న తాగునీటి సమస్యను, టిక్కా ఇళ్ళు వద్ద నెలకొన్న తాగునీరు, శానిటేషన్ సమస్యలను మరియు ముఖ్యంగా గ్యాస్ పైప్ లైన్ కొరకు ఏజెన్సీ వారు ఎక్కడపడితే అక్కడ గుంటలు తవ్వి సిమెంట్ రోడ్లు పగలగొట్టి అలాగే వదిలి వేస్తున్నారని , ఈ వర్షాకాలంలో ప్రమాదాలు జరిగే అవకాశం ఉన్నందున వెంటనే ఈ సమస్యలను పరిష్కరించాలని,  పై సమస్యలను కూడా గత నెలలో ఆర్టీవో గారి దృష్టికి తీసుకెళ్లామని ఆయన త్వరగా  పరిష్కరించాలని కోరుకుంటున్నామని అన్నారు.

Leave a Comment