ముంబైకి గర్వకారణమైన గేట్‌వే ఆఫ్ ఇండియా సమీపంలో ఉన్న 105 ఏళ్ల నాటి తాజ్‌మహల్ హోటల్‌ను టార్గెట్ చేసిన ఉగ్రవాదులు.. డిన్నర్ టైమ్‌లో హోటల్‌పై దాడి చేశారు. అకస్మాత్తుగా విచక్షణారహితంగా కాల్పులు జరపడంతో హోటల్లో ఉన్న వారందరూ ఒక చోటకు చేరుకున్నారు. ఈ దాడుల్లో తాజ్ మహల్ హోటల్లో 31 మంది చనిపోయారు.
భారతదేశ చరిత్రలో నవంబర్ 26వ తేదీ అత్యంత భయంకరమైన రోజుగా లిఖించబడింది. ఈ రోజు మది తలపుల్లోకి వస్తే చాలు దేశప్రజల మనసుల్లో కోపాన్ని రేకెత్తిస్తుంది. 2008 నవంబర్ 26 తేదీని దేశం ఎప్పటికీ మరచిపోదు. ఈ రోజున ఉగ్రవాదులు అత్యంత క్రూరమైన దాడికి పాల్పడ్డారు. ఈ దాడిలో 18 మంది భద్రతా సిబ్బందితో సహా 166 మంది మరణించారు.
ఈ ఏడాది ఉగ్రదాడి జరిగి 15 ఏళ్లు పూర్తయిన సందర్భంగా యావత్ దేశం నివాళులు అర్పిస్తున్నారు.