నియోజకవర్గ కార్యదర్శి మాట్లాడుతున్న ఏఐటీయూసీ నియోజకవర్గ కార్యదర్శిగూడూరు పట్టణంలోని లయోలా కళాశాలలో ఆదివారం నిర్వహించనున్న ఏఐటీయూసీ ప్రథమ మహాసభలను జయప్రదం చేయాలని ఆ యూనియన్ కార్యదర్శి ఎంబేటి చంద్రయ్య కోరారు. శనివారం గూడూరు సీపీఐ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. ప్రథమ మహా సభలకు జిల్లా స్థాయి ఏఐటీయూసీ నాయకులు హాజరవుతున్నట్లు తెలిపారు. ఈ సమావేశంలో జీ. శశి కుమార్, కే. నారాయణ, సీవీఎల్, యాకోబు, కృష్ణ, శ్రీనివాసులు, తాహీర్, సుధీర్, వెంకట రమణ తదితరులు పాల్గొన్నారు.