Advertisements

నిర్బాగ్యులైన వయోవృద్దులకు, భోజనం పంపిణి.

25:012:2023 శనివారం,..
తిరుపతిజిల్లా గూడూరు రెండవపట్టణ పరిధిలోఉన్న అడవయ్యకాలనీలోని గాడ్ గ్రేస్ సొసైటీవారు నడుపుతున్న అనాధ శరణాలయంలోని నిర్బాగ్యులైన వయోవృద్దులకు,పిల్లలకు స్థానిక చిన్నమసీదువీధి నివాసియైన కీ:శే:సయ్యద్ బుడేఖాన్ జ్ఙాపకార్దం వారి కూమారుడు బిస్మిల్లా హైదరాబాద్ థమ్ బిరియాని హోటల్ అధినేత సయ్యద్ ఫఠాన్ ఖాన్ దంపతుల దాతృత్వంతో రుచికరమైన చికెన్ బిరియాని,స్వీట్ ను స్థానిక బ్యూరో ఆఫ్ సోషల్ సర్వీస్ స్వచ్ఛంధ సేవాసంస్థ ఆధ్వర్యంలో అందజేసారు


ఈసందర్బానుద్దేశించి బాస్ స్వచ్ఛంధ సేవాసంస్థ అద్యక్షులు,యస్సీ&యస్ఎస్టీ అట్రాసిటి కమిటి సభ్యులు కూరపాటి రవీంద్రబాబు మాట్లాడుతూ ప్రవక్తసన్నిధి చేరిన పితరులను గుర్తుచేసుకుంటూ నెలకోమారు వయోవృద్దులపట్ల మక్కువతో సుచికరమైన భోజనంఅందజేసిన మైనారిటి ముస్లింసోదరుని కుటుంబానికి ప్రత్యేకధన్యవాదములు తెలియజేస్తూ అన్నదాతల సేవలను ప్రశంసిస్తున్నామని అనాదలను ఆదరించుటేకాక ఈఅవకాశాన్ని మాద్వారా అందచేయుట మహద్బాగ్యంగా భావిస్తున్నామన్నారు
పై కార్యక్రమంలో ఆశ్రమనిర్వాహకులు భాషాజాన్ పాల్ బాస్ స్వచ్ఛంధ సేవాసంస్థ భాద్యులు రంతుల్లా నసీర్ యశ్వంత్ రమేష్ రత్నమ్మ వృద్వీ తదితరులు పాల్గొన్నారు.

Leave a Comment