Advertisements

ఏపీ సచివాలయంలో ఏసీబీ దాడులు

ఏపీ సచివాలయంలో ఏసీబీ దాడులు కలకలం రేపాయి. లంచం తీసుకుంటూ ఏపీ సచివాలయ అధికారి ఏసీబీకి పట్టుబడ్డాడు. శుక్రవారం ఏపీ సచివాలయం బస్సు షెల్టర్ వద్ద నాటకీయంగా ఆర్థిక శాఖ సెక్షన్ ఆఫీసర్ లంచం తీసుకుంటుండగా ఏసీబీ దాడి చేసింది. ఏపీ సచివాలయంలోని ఆర్థిక శాఖలో సెక్షన్ ఆఫీసర్ గా నాగభూషన్ రెడ్డి పనిచేస్తున్నారు.సచివాలయం బస్సు షెల్టర్ వద్ద ఆర్థిక శాఖ సెక్షన్ ఆఫీసర్ నాగభూషన్ రెడ్డి లంచం తీసుకుంటూ ఏసీబీ వలలో పడ్డారు. వెలగపూడి సచివాలయం బస్ షెల్టర్ వద్ద రూ. 40,000 లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. విదేశీ విద్యోన్నత నిధులు మంజూరుకు సంబంధించిన ఫైల్ విషయంలో లంచం తీసుకుంటూ నాగభూషన్ రెడ్డి పట్టుబడ్డారు.

Leave a Comment