Advertisements

వైయస్‌ఆర్‌ భీమా తక్షణసాయం

వైయస్‌ఆర్‌ భీమా తక్షణసాయం అందజేత:
ఏర్పేడు మండలం యం డి పుత్తూరు గ్రామంకు  చెందిన పి బత్తెయ్య రెండురోజుల క్రితం అనారోగ్యంతో  హఠాత్తుగా మరణించారు. విషయాన్ని సర్పంచ్‌ దృష్టికి తీసుకొచ్చారు. వెంటనే స్పందించిన సర్పంచ్‌ మోహన ప్రియ వెల్పేర్‌ అసిస్టెంట్ ద్వారా వైయస్‌ఆర్‌ భీమాకు దరఖాస్తు చేసుకొనగా అందులకు సంబంధించిన తక్షణసాయం క్రింద పదివేల రూపాయులు జగనన్న ప్రభుత్వం మంజూరు చేసింది. ఆ మొత్తాన్ని సర్పంచ్‌ మోహన ప్రియ  సచివాలయ సిబ్బంది కలిసి బత్తెయ్య కుటుంబ సభ్యులకు అందచేసారు. ఈ కార్యక్రమంలో కార్యదర్శి లోకముని వెల్పేర్‌ అసిస్టెంట్ విష్ణుప్రియ వాలంటీర్‌ రవి  తదితరులు పాల్గొన్నారు.

Leave a Comment