తిరుపతి, నవంబర్ 22: ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు డిసెంబర్ 1 నుండి ఓటింగ్ యంత్రాలపై ప్రజలకు అవగాహన కల్పించనున్నామని జిల్లా కలెక్టర్ కె.వెంకటరమణా రెడ్డి తెలిపారు. బుధవారం ఉదయం స్థానిక కలెక్టరేట్ లో రాజకీయ పార్టీల ప్రతినిధులతో ఎస్ ఎస్ ఆర్ -2024పై జిల్లా కలెక్టర్ 14 వ రాజకీయ పార్టీలతో సమావేశం నిర్వహించారు.
జిల్లా కలెక్టర్ వివరిస్తూ జిల్లాలోని 7 నియోజకవర్గాలలో మెబైల్ వాహనాల ద్వారా జిల్లాకు చేరిన ఎం-3 ఓటింగ్ యంత్రాలపై అవగాహన కల్పించనున్నామని తెలిపారు. అలాగే కలెక్టర్ కార్యాలయం , తిరుపతి నగరపాలక సంస్థ , ఆర్ డి ఓ కార్యాలయం, తిరుపతి లలో మూడు చోట్ల అందుబాటులో ఉంటాయని, ఓటింగ్ విధానం తెలియదు అన్న ప్రశ్న తలెత్తకుండా అవగాహన కల్పించడం, అనుమానాలు నివృత్తి చేయడం జరుగుతుందని తెలిపారు. జిల్లాలో ఎస్ ఎస్ అర్ -2024 సర్వేలో అందిన ధరఖాస్తులకు సంబంధించి 3,25,565 గాను 2,26,546 పూర్తిస్థాయిలో పరిష్కరించడం జరిగిందని 20 శాతం వరకు వున్న పెండిగ్ దరఖాస్తులు మరో 10 రోజుల్లో పూర్తిచేయనున్నామని తెలిపారు. జిల్లాలో ఫోటో సిమిలర్ 817, డేమోగ్రఫికల్ 6259 ఓటర్లు వున్నట్లు డి- డుప్లికేట్ సాఫ్ట్ వేర్ సూచించిన మేరకు క్షేత్రస్థాయిలో పరిశీలన చేపట్టామని తెలిపారు. సెక్టోరల్ అధికారులగా 310 మందిని నియమించామని, పిర్యాదులు అందిన క్రిటికల్ , వర్నలబుల్ పోలింగ్ కేంద్రాలపై పరిశీలన చేపట్టి నిర్ణయించడం జరుగుతుందని వివరించారు. అన్ని వివరాలతో గుర్తించిన మరణించిన ఓటర్లను జాబితానుండి త్వరగా తొలగించడానికి ఇ ఆర్ ఓ లు చర్యలు తీసుకుంటున్నారని, స్వచ్చమైన ఓటరు జాబితా రూపొందించడమే లక్ష్యం అని తెలిపారు. ఈ సమావేశంలో వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు నగేష్ , సుధా రెడ్డి, ఎంపి నాయుడు , జయచంద్ర, రవి, రెవెన్యూ డివిజనల్ అధికారులు నిశాంత్ రెడ్డి, కిరణ్ కుమార్ , రవిశంకర్ రెడ్డి , చంద్రముని, స్పెషల్ డిప్యూటి కలెక్టర్లు కోదండరామిరెడ్డి, శ్రీనివాసులు , మునిసిపల్ కార్పోరేషన్ డిసి చంద్రమౌలీశ్వర రెడ్డి , ఎన్నికల సెక్షన్ సూపరిన్టెన్డెంట్ చంద్రశేఖర్ , సిబ్బంది పాల్గొన్నారు.