Advertisements

రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే  మళ్లీ  జగనే సీఎం కావాలి.

ఎమ్మెల్సీ మేరిగ మురళీధర్

గూడూరు  నవంబర్ -22 (విస్డం న్యూస్) ఆంధ్ర రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మళ్ళీ సీఎం కావాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని. ఉమ్మడి నెల్లూరు జిల్లా శాసన మండలి సభ్యులు మేరిగ మురళీధర్  పేర్కొన్నారు. బుధవారం సాయంత్రం మున్సిపల్ కార్యాలయం పక్కనున్న 8.వ సచివాలయాల సంబంధించి వార్డు కన్వీనర్లు బట్ట గోపి యాదవ్. శివ చైతన్య.. జమ్మల వాసు. జమ్మలసుకన్య .ఆధ్వర్యంలో స్థానిక ప్రజలు .వాలంటీర్లు. కార్యకర్తలు .వైఎస్ఆర్ సీపీ నాయకులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ మాట్లాడుతూ రాష్ట్రంలో అర్హులైన వారందరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందాలంటే మళ్ళీ వైఎస్ఆర్సిపి అధికారంలోకి రావాలన్నారు.గూడూరుపట్టణంలోని 8 .వ సచివాలయంలో ఏపీ వై నీడ్  జగన్ అనే కార్యక్రమాకార్యక్రమంలోఆయనపాల్గొన్నారు. ఎమ్మెల్సీ మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి వై.యస్ జగన్మోహన్ రెడ్డి ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను దశలవారీగా నెరవేర్చడం జరిగిందన్నారు. .పేద, బడుగు, బలహీన వర్గాల ప్రజలకు నేరుగా సంక్షేమ పథకాలు అందించాలన్న దృఢ సంకల్పంతో జగనన్న  రాష్ట్రంలో అనేక ఉద్యోగఅవకాశాలుకల్పించి.గ్రామాల్లోసచివాలయాలు,వాలంటీర్ వ్యవస్థ ద్వారా పేద ప్రజలకు సంక్షేమ పథకాలను అందించే బాధ్యతను చేపట్టడం జరిగిందన్నారు. .ప్రజల సంక్షేమాన్ని కోరుతూ రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడుస్తున్న ముఖ్యమంత్రి వై.యస్ జగన్మోహన్ రెడ్డిని మరోసారి ముఖ్యమంత్రి చేసుకోవాలన్నారు. అభివృద్ధి పాలనను ప్రజలకు చేరువ చేయాలన్న ఉద్దేశంతో గ్రామ సచివాలయం,వాలంటీర్ వ్యవస్థను తీసుకువచ్చి పారదర్శక  పాలనను అందిస్తున్నారన్నారని అన్నారు.2014 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఇచ్చిన హామీలను ఏ ఒక్కటి నెరవేర్చకుండా ప్రజలను మోసం చేసిందన్నారు  డ్వాక్రా రుణాలను పూర్తిగా మాఫీ చేస్తానని చెప్పి చేయకుండా మోసం చేసిందని చివర్లో  పసుపు కుంకుమ కింద డబ్బులు పంచి జనాల మోసం చేయాలనుకుందని చెప్పారు.  జగన్మోహన్ రెడ్డి ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం 2019 వరకు ఉన్న డ్వాక్రా రుణాల మొత్తాన్ని దశలు వారీగా మాఫీ చేస్తూ వస్తున్నారని చెప్పారు.ఇచ్చిన మాటకు కట్టుబడి ఉన్న వ్యక్తి జగన్ ఒక్కరేనన్నారు. అర్హులైన పేదలందరికీ కార్పొరేట్ విద్య, వైద్యం అందించిన ఘనత ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి కే  దక్కుతుందన్నారు. టిడిపి హయాంలో ఉద్యోగాలను భర్తీ చేయలేకపోతే నిరుద్యోగ భృతి ఇస్తానని చెప్పి మోసం చేశారని

కానీ జగన్మోహన్ రెడ్డి మానస పుత్రిక అయిన వాలంటీర్లను,సచివాలయ ఉద్యోగులను నియమించి ప్రతి ఇంటికి ప్రభుత్వ పథకాలు అందించేందుకు నూతన చరిత్రకు చరిత్రకు శ్రీకారం చుట్టారన్నారు. కార్యక్రమానికి ముందుగా ప్రభుత్వ సంక్షేమ పథకాల బోర్డునుఆవిష్కరించారు.
అదేవిధంగా కార్యక్రమానంతరం మైధిలి ఆసుపత్రి ప్రక్కన పార్టీ జెండా ను ఆవిష్కరించారు.ఈ కార్యక్రమంలో గూడూరు పట్టణ వైసిపి అధ్యక్షులు బోమిడి శ్రీనివాసులు , గూడూరు పట్టణ జే సి ఎస్ కన్వీనర్ రాఘవరెడ్డి, వైయస్సార్ చారిటబుల్ ట్రస్ట్ నిర్వాహకులు బత్తిన విజయ్ కుమార్. కాండ్ర నారాయణ రెడ్డి,వైసీపీ నాయకులు బట్ట గోపి యాదవ్, వాకాటి శ్రీధర్ రెడ్డి,   అజీజ్ భాయ్. అల్తాఫ్ బాయ్ అన్న మురళి. ప్రమోదు .పూర్ణ. సోషల్ మీడియా కన్వీనర్ వినోద్. హేమ చందు .జయరామయ్య. శ్రీనివాసులు కార్యకర్తలు. తదితరులు పాల్గొన్నారు.

Leave a Comment