తిరుపతి జిల్లా గూడూరు లోని మున్సిపల్ కార్యాలయం ఎదుట ఏ.పి.మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయిస్ ఫెడరేషన్ (సి.ఐ.టి.యు) అనుబంధం ఆధ్వర్యంలో రాష్ట్ర కమిటీ ఇచ్చిన పిలుపు మేరకు సోమవారం రోజు గూడూరు పట్టణంలోని మున్సిపల్ కార్యాలయం ఎదుట మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికులు నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది. అనంతరం నాయకులు మాట్లాడుతూ పట్టణాలు, నగరాలు, పరిశుభ్రం చేసి, ప్రజల ఆరోగ్యాన్ని, పర్యావరణాన్ని, పరిరక్షిస్తున్న, దళిత, గిరిజన ,బలహీనవర్గాలకు చెందిన మున్సిపల్ పారిశుద్ధ్య ,ఇంజనీరింగ్ కార్మికులకు జగనన్న హామీ మేరకు సమాన పనికి సమాన వేతనం, ఉద్యోగాలను పర్మినెంట్ చేయాలని, కేంద్ర,రాష్ట్ర, ప్రభుత్వాలు నగరాల సుందరీకరణ, అమృత పట్టణాలు, స్వచ్ఛ భారత్, వంటి ఆకర్షణీయమైన పేర్లు పెట్టి కార్మికులతో వెట్టి చాకిరీ చేయిస్తున్నాయి తప్ప,
మున్సిపల్, గ్రామ పంచాయతీ కార్మికుల సమస్యలను గాలి కొదిలేసతున్నాయని, చాలీ చాలని వేతనాలతో కుటుంబాలు గడవక అవస్తలు పడుతున్నా పట్టించుకునే దిక్కు లేదని. రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి గత ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను తాము అధికారంలోకి వచ్చిన 6నెలల్లో కాంట్రాక్టు, అవుట్సోర్సింగ్, కార్మికులకు,సమాన పనికి,సమాన వేతనం,ఉద్యోగాల పర్మినెంట్, చేస్తామన్న వాగ్ధానాలను గత నాలున్నర ఏళ్లుగా తుంగలో తొక్కారని, హామీలను అమలు వెంటనే అమలు చేయాలని,
పారిశుద్ధ్య కార్మికులకు ఆదాయ పరిమితి తో సంబంధం లేకుండా సంక్షేమ పథకాలు అమలు చేస్తామన్న వాగ్ధానం అటకెక్కించారని,
పర్మినెంట్ సిబ్బందికి సి.పి.ఎస్ రద్దు, ఓ.పి.ఎస్, అమలు వాగ్ధానానికి తూట్లు పొడిచారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి వారి సమస్యలను పరిష్కారం చేయాలని వారు డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో ఏ.పి. మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయిస్ ఫెడరేషన్ రాష్ట్ర కమిటి సభ్యులు బి. గోపీనాథ్, గూడూరు సిపిఎం సెంటర్ శాఖ కార్యదర్శి జోగి శివకుమార్, సి.ఐ.టి.యు పట్టణ అధ్యక్షులు బి.వి రమణయ్య, కార్యదర్శి యస్.సురేష్, కెవిపిఎస్ నాయకులు అడపాల ప్రసాద్, పామంజి మణి, జిల్లా కమిటి సభ్యులు బి.పెంచల ప్రసాద్ (పి.పి), బి మురళి,టి. రాఘవయ్య,పట్టణ అధ్యక్షులు బి. రమేష్,కార్యదర్శి, దార కోటే శ్వరరావు, శ్రామిక మహిళా సంఘం కార్యదర్శి సంపూర్ణమ్మ, వద్దమ్మ,పెంచలమ్మ నారాయణమ్మ, సుబ్బమ్మ వనమ్మ, మనెమ్మ,పెంచలమ్మ, తదితరులు పాల్గొన్నారు.