Advertisements

చెల్లూరు గ్రామంలో నీటి కష్టాలను తీర్చిన ఎమ్మెల్యే.బియ్యపు మధుసూదన్ రెడ్డి

ఏర్పేడు ( నవంబర్ 17): నీటి కష్టాలు తీర్చిన ఎమ్మెల్యే… బియ్యపు మధుసూదన్ రెడ్డి. ఏర్పేడు మండలం చెల్లూరు గ్రామంలో నీటి కష్టాలను తెలుసుకున్న ఎమ్మెల్యే 24 గంటలు గడవకముందే వెంటనే వైసిపి ఏర్పేడు మండల ఇన్చార్జి గున్నేరు కిషోర్ రెడ్డికు ఆదేశాలను జారీ చేశారు. ఆదేశాల మేరకు  బోర్ వేసే వాహనంను తెప్పించి బోరను వేయించి, త్రాగునీటిని పైకి తెప్పించి చెల్లూరు గ్రామ ప్రజల యొక్క త్రాగునీటి కష్టాలను తీర్చారు. ఎమ్మెల్యే త్రాగునీటి కష్టాలను తీర్చినందుకుగాను గ్రామ ప్రజలు ఎమ్మెల్యేకు అభినందనలు తెలియజేశారు.

Leave a Comment