తిరుపతి జిల్లా గూడూరు పట్టణం లో : జాతీయ పత్రికా దినోత్సవం న్ని ఘనంగా నిర్వహించారు. పట్టణంలోని ఆర్అండ్ బి కార్యాలయ సమీపంలో ఉన్న జ్యోతిరావు పూలే దంపతుల విగ్రహం ఎదుట భారీ కేక్ కట్ చేసి పాదచారులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా పాత్రికేయ లుమాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల జారీ చేసిన జీఓ నెంబర్ 43 ను సవరించాలన్నారు. ఆ జీఓతో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 30వేల మంది జర్నలిస్టులలో కేవలం 3వేల మందికి ఇళ్ల స్థలాలు మంజూరయ్యే పరిస్థితి ఉందన్నారు. ప్రభుత్వం స్పందించి వివేకరులందరికీ ఇళ్ల స్థలాలు మంజూరయ్యే విధంగా చర్యలు తీసుకోవాలని కోరారు. జర్నలిస్టుల తరపున సీఎం, ఉన్నతాధికారులతో చర్చించిన ఏపీయుడబ్ల్యూజే, ఐజేయూ నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులు ఆత్మకూరు సురేష్, సుబహాన్, తులసిరాజు, బట్టి జనార్దన్, పాశిం రవి కుమార్, నిరంజన్, వెంకటేష్, సిరాజ్, కృపానిధి తదితరులు పాల్గొన్నారు.