Advertisements

యువనేస్తం అసోసియేషన్ అందిస్తున్న సేవలను గుర్తిస్తూ పురస్కార ప్రధానం : అధ్యక్షులు మునిశేఖర్

ఏర్పేడు (నవంబర్ 16): రేణిగుంట మండలం, కరకంబాడీ హైస్కూల్ నందు జరిగిన యువతేజం ట్రస్ట్ 6 వ వార్షికోత్సవం సందర్బంగా యువ నేస్తం అసోసియేషన్ అందిస్తున్న సేవలను గుర్తించి కలాం జాతియ పుష్కారాన్ని యువ నేస్తం చారిటబుల్ ట్రస్ట్ అధ్యక్షుడు వినోద్ కుమార్ కు అందివ్వడం జరిగిందని, యువ నేస్తం అసోసియేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు మధురాంతకం .మునిశేఖర్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏర్పేడు మండలంలో మన యువనేస్తం అసోసియేషన్ పలు గిరిజన కాలనీలలో అందిస్తున్న సేవలను గుర్తించి మాకు ఈ పురస్కారానికి ఎంపిక చేసినందుకు యువతేజం ట్రస్ట్ వారికి ధన్యవాదాలు తెలిపారు. ఈ పురస్కారాన్ని యువ నేస్తం తరపున చారిటబుల్ ట్రస్ట్ అధ్యక్షుడు కే వినోద్ కుమార్ తీసుకోవడం జరిగిందని మాకు చాలా ఉందని ఈ సందర్భంగా తెలిపారు.

Leave a Comment