భారతీయ జనతా యువమోర్చా బీజేవైఎం గూడూరు నియోజకవర్గ ఆధ్వర్యంలో బీజేవైఎం రాష్ట్ర అధ్యక్షులు మిట్టా వంశీ ఆదేశాల మేరకు పత్రిక విలేకరుల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ఈ సందర్భంగా బీజేవైఎం రాష్ట్ర అధికార ప్రతినిధి మనోజ్ కుమార్ మాట్లాడుతూ ప్రతి ఏటా సుమారు రూ.6 వేల కోట్లతో 17 లక్షల మెట్రిక్ టన్నుల ఆహార ధాన్యాలను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని 60 శాతం కంటే ఎక్కువ మంది పేదలకు ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారి నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం రేషన్ ద్వారా అందిస్తోంది.ఆహార ధాన్యాలను పంపిణీ చేస్తున్న రాష్ట్ర వ్యాప్తంగా ఆహార ధాన్యాలను పంపిణీ చేస్తున్న 9260 రేషన్ వాహనాలకు అందించిన రాయితీలో 60 శాతం కేంద్రం మంజూరు చేసింది.కేంద్ర ప్రభుత్వ సాయంతో రేషన్ ద్వారా ఆహార ధాన్యాలను అందిస్తున్న రేషన్ పంపిణీ వాహనాలపై ప్రధాని నరేంద్రమోదీ ఫోటోలేకపోవడాన్ని భారతీయ జనతా పార్టీ యువ మోర్చా తీవ్రంగా ఖండిస్తోంది.భారతీయ జనతా పార్టీ యువ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు శ్రీ మిట్టా వంశీ కృష్ణ నాయకత్వంలో రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యంపై, అక్రమాలపై ఎటువంటిపోరాటానికి అయినా మేమంతా సిద్ధంగా ఉన్నాము. ఇప్పటికైనా గానీ రాష్ట్ర ప్రభుత్వం రెవిన్యూ మరియు సివిల్ సప్లై వారు స్పందించి ప్రధాని నరేంద్ర మోడీ ఫోటోను రేషన్ వాహనాలపై ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు, డిసెంబర్ రెండో తేదీ లోపల ఆంధ్రప్రదేశ్లో రేషన్ వాహనాల పైన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఫోటోను ఏర్పాటు చేయకపోతే డిసెంబర్ మూడో తేదీ నుండి భారతీయ జనతా యువమోర్చా బీజేవైఎం ఆధ్వర్యంలో మేమే రేషన్ వాహనాలపైన ప్రధాని మోడీ ఫోటోలు ఏర్పాటు చేస్తామని హెచ్చరించారు, లేనిపక్షంలో ఉద్యమం తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో బీజేవైఎం నాయకులు వెంకటేష్ చైతన్య, నవీన్, కిరణ్, మహేష్ తదితరులు పాల్గొన్నారు