ఏర్పేడు (నవంబర్ 16) … ఏర్పేడు మండలం యం. డి. పుత్తూరు గ్రామ సర్పంచ్ కందాటి. మోహన ప్రియ కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల వాసుడు శ్రీనివాసుని హృదయదేవేరి శ్రీ పద్మావతి అమ్మవారికి తిరుచానూరు లో అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్న కార్తిక బ్రహ్మోత్సవాలలో భాగంగా బుధవారము రాత్రి గరుడ వాహన సేవలో పద్మావతి అమ్మవారి వేషధారణలో అమ్మవారి సేవలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ ఆ దేవదేవుని హృదయదేవేరి అలివేలుమంగమ్మ వారి కార్తిక బ్రహ్మోత్సవాలలో గరుడ వాహన సేవ రోజు అమ్మవారి సేవలో పాల్గొనడం జన్మ జన్నల పుణ్యమని తెలియచేసారు.