Advertisements

దీపావళి రోజున ప్రమాదాలు జరగకుండా పిల్లల పట్ల తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలి. 2 టౌన్ సి ఐ.  K.వెంకటేశ్వరరావు

తిరుపతి జిల్లా గూడూరు పట్టణ 2 టౌన్ సీఐ K.వెంకటేశ్వరరావు స్థానికి మీడియా తో మాట్లాడుతూ.ముందస్తుగా గూడూరు పట్టణ ప్రజలకు దీపావళి శుభాకాంక్షలు తెలపారు.దీపావళి పండుగను సందర్భంగా పట్టణ ప్రజలుకు, బాణాసంచా అమ్మకాలు జరిపే  వారుకు పలు సూచనలు జారీ చేశారు.దీపావళి రోజున పిల్లల పట్ల తల్లిదండ్రులు  అప్రమత్తంగా ఉండాలన్నారు. పిల్లలు టపాసులు కాల్చేటప్పుడు  పెద్దల పర్యవేక్షణ విధిగా ఉండాలని ,ప్రమాదాలు జరగకుండా తగు జాగ్రత్తలు పాటించాలన్నారు. గూడూరు 2 టౌన్ పోలీస్ స్టేషన్ పరిదిలో బాణసంచా అమ్మకాలకు లైసెన్స్లు తప్పనిసరిగా ఉండాలని సూచించారు.బాణసంచా  విక్రయాలు జరిపే వాళ్ళు  షాప్ లలో అనుమతి లేకుండా ఎలాంటి బాణసంచా మరియు ప్రేలుడు పదార్దాలును విక్రయించిన, అక్రమ నిల్వలు చేసిన, అమ్మిన కఠినచర్యలు తీసుకోబడతాయని హెచ్చరించారు. రెవెన్యూ, పోలీస్ అధికారులు సూచించిన ప్రాంతంలోనే దుకాణాలు ఏర్పాటు చేసుకుని అమ్మకాలు జరపాలని విక్రయ కేంద్రాల వద్ద నిర్వాహకులు అనుక్షణం అప్రమత్తంగా ఉండి నియమ నిబంధనలు తూచా తప్పకుండా పాటించాలని సి ఐ తెలపారు. బాణాసంచి వల్ల ఎక్కువ ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది కాబట్టి
నివాసాలకు, విద్యా సంస్థలకు, ఆసుపత్రులకు దూరంగా బాణసంచా దుకాణాలు ఏర్పాటు చేసుకోవాలన్నారు.బాణాసంచా విక్రయించే దుకాణాలు వద్ద  నీరు, పొడి ఇసుక, తదితర సామగ్రిని సిద్ధంగా ఉంచుకోవాలని సూచించారు.ఏదైనా ప్రమాదం సంభవిస్తే వెంటనే ఫైర్ స్టేషన్కు 101, పోలీసులకు 100 లేదా 112కి ఫోన్ చేసి సమాచారం ఇవ్వాలి.
గూడూరు టూ టౌన్ సిఐ వెంకటేశ్వరరావు తెలిపారు

Leave a Comment