Advertisements

ప్రజా ప్రగతి ట్రస్ట్ ,మై ఛాయిసెస్ ఫౌండేషన్ వారి సహకారంతో సురక్షిత గ్రామము

ఏర్పేడు ( నవంబర్ 4) ప్రజా ప్రగతి ట్రస్ట్ ,మై ఛాయిసెస్ ఫౌండేషన్ వారి సహకారంతో సురక్షిత గ్రామము అనే కార్యక్రమాన్ని ఏర్పేడు జడ్పీ.హెచ్. స్కూల్లో నిర్వహించారు .ఈ కార్యక్రమంలో ప్రోగ్రాం కోఆర్డినేటర్ దేవేంద్ర కుమార్ మాట్లాడుతూ పిల్లలు బాల్య వివాహాల పట్ల మరియు అక్రమ రవాణా పట్ల ఎప్పుడు అప్రమత్తంగా ఉండాలని తెలియజేస్తూ, అందరికీ కామిక్ బుక్స్ ని అందజేశారు .అలాగే ప్రజా ప్రగతి ట్రస్ట్ కోఆర్డినేటర్ చంద్రశేఖర్ గారు మాట్లాడుతూ పిల్లలు ఎప్పుడు అత్యవసరమైన టోల్ ఫ్రీ నెంబర్స్ ను తమ వద్ద ఉంచుకోవాలని తెలియజేస్తూ అందరికీ టోల్ ఫ్రీ నెంబర్స్ ను తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమం ద్వారా  ఏర్పేడు హై స్కూల్ బాల బాలికలకు బాల్య వివాహాలు మీద అవగాహన కల్పించి, బాలల హక్కుల మీద కూడా అవగాహన కల్పించారు.ఈ కార్యక్రమంలో పిల్లలు బొమ్మల పోటీలలో పాల్గొని బాల్య వివాహాల  నిర్మూలన పైన చిత్రపటాలను గీసి వాటిపై అవగాహన పొందారు మరియు పాఠశాల ఉపాధ్యాయులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని  పాఠశాల బాల బాలికలకు బాల్యవివాహాల పైన మరియు అక్రమ రవాణా పైన వగాహన పొంది, టోల్ ఫ్రీ నెంబర్స్ ఏ విధంగా ఉపయోగించుకోవాలో తెలియజేయడం జరిగింది.

Leave a Comment