తేదీ:02.11.2023 న గూడూరు
తిరుపతి జిల్లా గూడూరు
వెలుగు కార్యాలయం నందు శ్రీయుత రెవెన్యూ డివిజనల్ అధికారి గూడూరు వారు గూడూరు నియోజవర్గం పరిధిలో ఉన్న గూడూరు టౌను మరియు మండలము బూత్ లెవెల్ అధికారులు మరియు సూపర్ వైజర్లతో సమీక్ష సమావేశం నిర్వహించారు.స్పెషల్ సమ్మరీ రివిజను 2024 ప్రకారం బిఎల్ఓ లు డోర్ టు డోర్ సర్వే చేయాలని ఆర్డిఓ సూచించారు.అందరు బిఎల్వోలు మీటింగ్ కు హాజరు కావాలి, హాజరు కానీ వారిపై చర్యలు ఉంటాయని ఆర్డిఓ తెలియజేశారు.
అందరు బిఎల్వోలు ఫారం- 6, 6ఏ ,7, 8 మరియు 8ఏ ల పై అవగాహన కలిగి ఉండాలని ఆర్డీవో గారు సూచించారు మరియు ఆ ఫారం లను ఏ సందర్భాలలో వినియోగించాలని తెలియజేశారు. స్పెషల్ క్యాంపెయిన్ డే ఉన్నప్పుడు ఫారం 6 లో 01.01.2024 నాటికి 18 సంవత్సరాలు పూర్తయిన వారు కొత్త ఓటరుకి అర్హులు అవుతారని వారి నుండి సంబంధిత ఫారాలను తీసుకోవాలని చెప్పారు.ఫారం 6-!ఏ లో ఈ ప్రదేశానికి సంబంధించిన ఓటర్లు విదేశాల్లో ఉంటూ పాస్పోర్ట్ మరియు వీసా ఆధారాలతో నమోదు చేయొవచ్చుని తెలపారు ఫారం 7 లో చనిపోయిన ఓటర్లు, పెళ్లి అయ్యి గ్రామాన్ని వదిలి వెళ్ళిన వాళ్ళు మరియు శాశ్వతంగా మరోచోటికి వెళ్లిపోయిన వారిని చూపాలని తెలియజేసారు.
ఫారం 8 లో ఓటర్ పేర్లు గాని అడ్రస్ గాని కరెక్షన్ చేయుట కొరకు ఓటర్ కి వివరించి వారి చేత ఆ ఫారం నందు సంతకాలు పెట్టించుకోవాలని ఆర్ డి ఓ గారు బిఎల్ వరకు వివరంగా తెలియజేశారు.జెండర్ రేషియో మరియు ఈపీ రేషియో పర్సంటేజ్ ను సమగ్రంగా ఉండాల చూసుకోవాలని ఆర్డిఓ తెలిపారు.పురుషులు, మహిళలు మరియు త్రాడ్ జెండర్ వివరాలతో అవగాహన కలిగి ఉండాలని బిఎల్ వరకు సూచించారు.బిఎల్వోలు వాళ్ల పోలింగ్ స్టేషన్ పరిధిలో ఉన్న వి వి ఐ పి మరియు విఐపి, ప్రజా ప్రతినిధులు, అనధికారులు ఓటర్ జాబితాలో ఉన్నారా లేదా అని పరిశీలించుకోవాలని ఆర్డీవో ఆదేశించారు.జీరో డోర్ నెంబర్లు విషయమై గూడూరు మండలము కు సంబంధించి ఫారం 8 ల ద్వారా డోర్ నెంబర్లు ఓటరు లిస్టుకు చేర్చాలని సూచించారు అదేవిధంగా 100 సంవత్సరాలు దాటిన ఓటర్లను పరిశీలించి, వారి వయసు నిర్ధారించుకుని అవసరమైతే వారి వయసును సరిచేయుటకు ఫారం 8 ను నమోదుచేయాలి. తెలపారురూఫ్ లెస్ ఓటర్లను గుర్తించి వారికి సంబంధించి ప్రస్తుతము జరుగుతున్న జగనన్న సురక్ష నందు వారికి రైస్ కార్డు/ ఆధార్ లను మంజూరుచేసి, వారికి కూడా ఓటు నమోదుచేయుటకు సరియగు చర్యలు తీసుకోవాలని తెలిపారు..ఎలక్షన్ కమిషన్ నుంచి వచ్చిన ఆదేశాలను జిల్లా కలెక్టర్ వారు అమలు చేయాల్సి ఉంటుందని అందుకు మండల స్థాయిలో తాసిల్దారులు తెలిపిన విధంగా బి ఎల్ ఓ లు నడుచుకోవాలని ఆర్డిఓ తెలిపారు.డోర్ టు డోర్ సర్వే చేసి ప్రస్తుతం ఉన్న ఓటర్ లిస్ట్ అవకతవకలను సరి చేసే అవకాశం ఉన్నదని ఈ అవకాశాన్ని ఉపయోగించుకునేలా బి ఎల్ వోలు పనిచేయాలని ఆర్డీవో గారు ఆదేశించారు.
ఎలక్షన్స్ సమయానికి ఎటువంటి అవకతవకలు ఉండకుండా చూసుకోవాల్సిన బాధ్యత బిఎల్ ఓ లదని ఆర్డీవో తెలిపారు.ఈ సమావేశంలో తహసీల్దార్ గూడూరు, మున్సిపల్ కమిషనర్ గూడూరు, ఎన్నికల ఉప తహసీల్దార్, సూపర్వైజర్లు, బిఎల్ఓ అందరూ పాల్గొన్నారు.