Advertisements

యంపిపి గీత అధ్యక్షతన యం డి పుత్తూరులో జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం.

ఏర్పేడు: ఏర్పేడు మండలం యం డి పుత్తూరు గ్రామంలో గురువారం జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం ఏర్పేడు మండల యంపిపి గీత అధ్యక్షతన  నిర్వహించబడినది. ఈ కార్యక్రమంనకు ముఖ్య అతిథిగా ఏర్పేడు మండల వైసిపి ఇంచార్జి గున్నేరి కిషోర్‌ కుమార్‌ రెడ్డి ప్రత్యేక అతిథిగా మండల వైసిపి అధ్యక్షులు కూనాటి రమణయ్య యాదవ్‌, విశిష్ట అతిథిగా కో ఆప్షన్ సభ్యులు బత్తిశెట్టి, ఆత్మీయ అతిథిగా వైస్‌ యంపిపి జమళ్ల శ్రీనివాసులు యాదవ్‌ పాల్గొన్నారు.

రాష్ట్రంలో ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఉండాలని జగనన్న ఎంతో ప్రతిష్ఠాత్మకంగా ప్రతి గ్రామ సచివాలయం నందు ఆరోగ్య సురక్ష కార్యక్రమం నిర్వహిస్తున్నారని  ఈ కార్యక్రమం ద్వారా రక్త పరీక్షలు నేత్ర పరీక్షలు ఇసిజి తదితర ఆరోగ్య పరీక్షలు నిర్వహించి తగిన చికిత్సలు అందచేస్తారని తెలియపరిచారు.

యం డి పుత్తూరు గ్రామంలో 600 మంది వరకు ఆరోగ్య పరీక్షలు చేయించుకొని తగిన వైద్య సహాయం పొందారని వారందరికీ మందులు పంపణీ చేసామని  తెలియపరిచారు. ఈ కార్యక్రమం నందు యంపిటిసి పద్మమ్మ సర్పంచ్‌ మోహన ప్రియ మడిబాక సర్పంచ్‌ చెంగలరాజు,  ఉపసర్పంచ్‌ గౌరి వార్ఢుమెంబర్‌లు ఏర్పేడు మండల మహిళ అధ్యక్షురాలు సురేఖ మహిళ ఉపాధ్యక్షురాలు అమ్ములు ఏపి సీడ్‌ మెంబరు సుబ్రహ్మణ్యం యాదవ్‌, ఏర్పేడు మండల వైసిపి తూర్పు విభాగ అధ్యక్షులు గురవారెడ్డి, సచివాలయ సిబ్బంది వాలంటీర్లు సచివాలయ కన్వీనరు రామయ్యాచారి గృహసారధులు వేణు సుధాకర్‌ సుబ్రహ్మణ్యాచారి మురగయ్య  సీనియర్ వైసిపి నాయకులు గోవర్దన్‌ రెడ్డి దామోదర రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Leave a Comment