Advertisements

తొట్టంబేడు లో పరామర్శించిన మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సతీమణి నారా భువనేశ్వరి

(Wisdom news ప్రతినిధి)
శ్రీకాళహస్తి 2023 అక్టోబర్ 26
నిజం గెలవాలి అనే కార్యక్రమంలో భాగంగా శ్రీకాళహస్తి నియోజవర్గంలోని తొట్టంబేడు మండలంలో మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సతీమణి రారా భువనేశ్వరి పర్యటించారు.

గ్రామంలోని వెంకటరమణ అనే వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు అరెస్టు తట్టుకోలేక గుండెపోటుతో ముడి చెందారని టిడిపి నాయకులు మృతుల కుటుంబాలకి పరామర్శించి మూడు లక్షల రూపాయల చెక్కును అందజేశారు అనంతరం తొట్టంబేడు మండలంలోని కొనతినేని గ్రామం కు చెందిన గాలి సుధాకర్, వెంకటసుబ్బయ్య గౌడ్ కుటుంబాలను పరామర్శించారు వారికి కూడా 3 లక్షలు చెక్కును అందజేశారు

మరియు వారి కుటుంబాలకు అండగా ఉంటామని మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సతీమణి నారా భువనేశ్వరి వెల్లడించారు.ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులతో పాటు జనసేన నాయకులు పాల్గొని సంఘీభావం తెలియజేశారు. శ్రీకాళహస్తి నియోజకవర్గం ఇంచార్జ్ బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి, బొజ్జల బృందమ్మ మరియు బొజ్జల రిషితా రెడ్డి వనభాకా లక్ష్మి, మాజీ శ్రీకాళహస్తి ఎమ్మెల్యే ఎస్ సి వి నాయుడు, గాలి మురళి నాయుడు,కాశరం రమేష్,వజ్రం కిషోర్, వెంకటసుబ్బయ్య, జనసేన నాయకులు కోట వినిత కోట చంద్రబాబు తదితరులు పాల్గొన్నారు

Leave a Comment