మనిషి శ్వాస తీసుకోలేని సమయంలో నోటి ద్వారా శ్వాసను అందించడం ద్వారా మనిషిని బతికిస్తారు. అయితే ఇలాంటి సీపీఆర్‌ను పాముకు చేస్తే ఎలా ఉంటుంది. అచ్చంగా మనిషి నోట్లో ఊదినట్లు పాము నోట్లో గాలి ఊదితే ఎలా ఉంటుంది.? ఊహించుకోవడానికే భయంగా ఉంది కదూ.! కానీ మధ్యప్రదేశ్‌కు చెందిన ఓ పోలీస్ ఆఫీసర్ మాత్రం పాముకు సీపీఆర్ చేసిన అందరినీ ఆశ్చర్యానికి గురి చేశాడు…