అనకాపల్లి,అక్టోబర్,16:
అనకాపల్లి జిల్లా పరవాడ మండలం పర్యటనలో ముఖ్యమంత్రికి సమస్యలను విన్నవించుకున్న బాధితులువారి సమస్యలు విని చలించిపోయిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి
తక్షణమే ఆర్థిక సాయం అందించాలని జిల్లా కలెక్టర్ కు మౌఖిక ఆదేశాలు జారీ చేశారు.లక్ష రూపాయలు చొప్పున ఇద్దరు బాధితులకు ప్రభుత్వం తరఫున జిల్లా కలెక్టర్ ఆర్థిక సహాయం అందజేసారు.పరవాడ మండలం పరవాడ వద్ద రూ.450 కోట్ల రూపాయల వ్యయంతో చేపట్టిన యూజియా స్టెరిల్స్ ప్రెవేట్ లిమిటెడ్ ప్రారంభోత్సవ అనంతరం తిరుగు ప్రయాణంలో హెలీప్యాడ్ వద్దకు చేరుకున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని వివిధ అనారోగ్య కారణాలతో బాధపడుతున్న బాధితులు కలిసి వైద్యచికిత్స నిమిత్తం ఆర్థిక సాయం కావాలని విన్నవించుకున్నారు. కశింకోట మండలం, విసన్నపేట గ్రామ పంచాయతీకి చెందిన యన్. లోకేష్ (13), యన్. గుణసాగర్ (11) ఇద్దరు పిల్లలు తలసేమియాతో బాధపడుతున్నారు, 15 రోజులకు ఒక సారి హైదరాబాద్ లేదా విశాఖపట్నంలో రక్త మార్పిడి చేస్తున్నట్లు రాష్ట్ర ముఖ్యమంత్రి వై.యస్. జగన్ మోహన్ రెడ్డి ని కలసి తమ సమస్యను విన్నవించగా ముఖ్యమంత్రి బాధితుల సమస్యలను ఓపికగా విని వారితో కాసేపు మాట్లాడి వారిలో మనోధైర్యం నింపే ప్రయత్నం చేస్తూ, మేమున్నామని ధైర్యం నింపారు. ముఖ్యమంత్రి వై.యస్. జగన్ మోహన్ రెడ్డి తక్షణమే స్పందించి వైద్య ఖర్చులు ప్రభుత్వమే భరిస్తుందని, ప్రస్తుత ఖర్చుల నిమిత్తం ఒక్కొక్కరికి లక్ష రూపాయలు చొప్పున ఆర్థిక సహాయం చేయాల్సిందిగా జిల్లా కలెక్టర్ రవి పట్టాన్ శెట్టి ని ఆదేశించారు. ఆ మేరకు జిల్లా కలెక్టర్ ఇద్దరు పిల్లలకు రెండు లక్ష రూపాయలు చెక్ అంద చేశారు.ఆర్థిక సహాయం అందుకున్న బాధితుల తల్లి, కుటుంబ సభ్యులు ముఖ్యమంత్రికి రుణపడి ఉంటామని, హృదయ పూర్వక కృతజ్ఞతలు తెలియచేశారు.