

తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆరోగ్యం పట్ల నిర్లక్ష్యం వహిస్తే సీఎం వైయస్ జగన్మోహన్ రెడ్డి బాధ్యత వహించాలని తెలుగుదేశం పార్టీ తిరుపతి పార్లమెంట్ మైనారిటీ సెల్ అధ్యక్షుడు షేక్ జలీల్ అహ్మద్ అన్నారు. తిరుపతి జిల్లా కోట పట్టణంలోని ఎస్కేబీ గ్రూప్స్ ప్రాంగణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు.ఈ సందర్బంగా జలీల్ అహ్మద్ మాట్లాడుతూ..ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును అక్రమంగా అరెస్టు చేసి రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉంచిన నేపథ్యంలో జైల్లో చంద్రబాబు నాయుడుకు కనీస వసతులు కల్పించడం లేదదన్నారు. 14 ఏళ్లు సీఎంగా చేసిన వ్యక్తి, జెడ్ కేటగిరి ఉన్న టీడీపీ అధినేత చంద్రబాబు ఆరోగ్యం పట్ల రాజమండ్రి సెంట్రల్ జైలు అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారని మండిపడ్డారు.రాజమండ్రిలో టిడిపి మేనిఫెస్టో విడుదల చేయడంతో ప్రజల్లో టిడిపి చొచ్చుకుపోయిందని, ప్రభుత్వ వ్యతిరేకత, టీడీపీ మినీ మేనిఫెస్టోతో జగన్మోహన్ రెడ్డి ఖంగుతిన్నాడని, ఇక ఓటమి తప్పదనే చంద్రబాబు నాయుడుని అక్రమ కేసులు పెట్టి అరెస్టు చేశారు అని అన్నారు. రాజమండ్రి జైల్లో ఉన్న చంద్రబాబు స్కిన్ ఎలర్జీతో బాధపడుతున్నారని ఆవేదన వ్యక్తపరిచారు. 34 రోజులు పాటు ఎన్ని ఇబ్బందులు వచ్చినా సరే దృఢమైన విశ్వాసంతోనే ఉన్నారని అన్నారు. వైసిపి అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో శాంతిభద్రతలకు విఘాతం కలిగిందని, దేశమంతా నిరసన దీక్షలతో మారుమోగుతోందని అన్నారు. అదే సమయంలో ప్రతి ఇంటికి టిడిపి ప్రభుత్వం చేసే మేలు తెలియజేసే బాధ్యత ప్రతి ఒక్కరి పైన ఉందన్నారు.ప్రపంచమంతా చంద్రబాబు ఆరోగ్య మీద ఆందోళన వ్యక్తం చేస్తున్నారని ఆవేదన చెందారు. టీడీపీ శ్రేణులు పిలుపునిస్తున్న నిరసనలలో అన్ని ప్రాంతాల ప్రజలు స్వచ్చందంగా భాగస్వామ్యం కావడమే ఇందుకు నిదర్శనం అని అన్నారు. చంద్రబాబు, టీడీపీ నాయకులపై జరుగుతున్న కుట్రలు, కుతంత్రాలను అన్ని ప్రాంతాల ప్రజలు గమనిస్తున్నారని, జగన్ ప్రభుత్వానికి ప్రజలు త్వరలో బుద్ధి చెబుతారని, రాబోయే ఎన్నికల్లో వైసీపీ అడ్రస్ గల్లంతు కావడం ఖాయం అని అన్నారు. చంద్రబాబుకు ఏం జరిగినా దానికి వైసీపీ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి బాధ్యుడు అని అన్నారు. కోర్టులపై తమకు నమ్మకం ఉందని త్వరలోనే చంద్రబాబుకు న్యాయం జరుగుతున్న విశ్వాసాన్ని వ్యక్తం ఆయన చేశారు. చంద్రబాబుపై ఉన్న అక్రమ కేసులు అన్నీ కూడా వీగిపోయి త్వరలోనే కడిగిన ముత్యంలా బయటికి వస్తారని జలీల్ అహ్మద్ అన్నారు.చంద్రబాబు అనారోగ్యంపై హెల్త్ బులెటిన్ విడుదల చేయకుండా, ఆయన అనారోగ్యాన్ని చులకన చేసేలా.. వైసీపీ పార్టీ అగ్రశ్రేణి నాయకులు చంద్రబాబు జైలుకెళ్ళిన తర్వాత బరువు పెరిగారని, ఒక చిన్న టాబ్లెట్ వేసుకుంటే నయమయ్యే రోగమని ఆయన అనారోగ్యంపై చులకనగా, వ్యంగ్యంగా, వెటకారంగా స్పందించడాన్ని తీవ్రంగా తప్పుబట్టారు. చంద్రబాబు ఆరోగ్య స్థితిగతులపై ఆయన రెగ్యులర్ గా పర్సనల్ చెకప్ చేయించుకునే వైద్యులకే అవగాహనా ఉంటుందని, వారి ద్వారా పరీక్షలు చేయించాలని, ప్రైవేట్ వైద్యులచే మెరుగైన వైద్య సాయం, వైద్యసేవలు అందించాలని డిమాండ్ చేసారు.ఈ కార్యక్రమంలో.. తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు కోట మాజీ ఎంపీపీలు మానికల పవన్ కుమార్, గుర్రం అశోక్ కుమార్, కందలి బాలకృష్ణ యాదవ్, మైనారిటీ నాయకులు షేక్ షంషుద్దీన్, షేక్ నౌషాద్, షేక్ నాయబ్ రసూల్, కోట బిట్-1 ఎంపీటీసీ దారా సురేష్, కోకోర్ల మధుయాదవ్, తదితరులు పాల్గొన్నారు.