Advertisements

జెండా ఉత్సవాలను శాంతియుతంగా ప్రజలు జరుపుకోవాలి గూడూరు డీఎస్పీ సూర్యనారాయణ రెడ్డి

దేవీ నవరాత్రి ఉత్సవాల్లో  300మంది పోలీస్ బందో బస్తు

దేవీ నవరాత్రి ఉత్సవాల్లో   భాగంగా  గూడూరు పట్టణంలో జరిగే శ్రీ ఆంజనేయ స్వామి జెండా ఉత్సవాల ను శాంతియుతంగా ప్రజలు జరుపుకోవాలని గూడూరు డీఎస్పీ సూర్యనారాయణ రెడ్డి తెలిపారు. శనివారనాడు సాయంత్రం గూడూరు ఒకటో పట్టణ  పోలీస్ స్టేషన్లో  డీఎస్పీ మాట్లాడుతూ జెండా ఉత్సవాల్లో ఎక్కడైనా శాంతి భద్రతలకు విఘాతం కలిగించే చర్యలకు పాల్పడే వ్యక్తులపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. జెండా నిర్వహణకు  గూడూరు పట్టణంలో 300 మంది పోలీస్ బందో బస్తును ఏర్పాటు చేశామన్నారు. ముఖ్యంగా ముందస్తు లో భాగంగా  పట్టణంలో కరణాల వీధి,తూర్పు వీధి, గమళ్ళ పాలెంలో ఒక సీఐ,ఒక ఎస్సై 10 మంది పోలీస్ లను ఏర్పాటు చేశామన్నారు.పాదచారులకు, ద్విచక్ర వాహన దారులకు ఎలాంటి ఇబ్బందీ లేకుండా నియంత్రణా చర్యల్లో భాగంగా శాధుపేట సెంటర్,సంగం ధియేటర్,రైల్వే స్టేషన్ మీదుగా దారి మళ్లించామన్నారు. ప్రజలు పోలీస్ వారి నిబంధనలు పాటించి జెండా ఉత్సవాన్ని జరుపుకోవాలని సూచించారు.ఈ సమావేశంలో రూరల్ సీఐ దశరదరామారావు, ఒకటో పట్టణ సీఐ హజరత్ బాబులు ఉన్నారు.

Leave a Comment