

జాతీయ రహదారి వద్ద చంద్రబాబు కాలనీ నుండి నరసారెడ్డి కండ్రిగ వెళ్లే క్రాసింగ్ వద్ద సూచిక బోర్డుల ఏర్పాటుఎంపీ గురుమూర్తి ఆదేశాలతో వెంటనే స్పందించిన జాతీయ రహదారి అధికారులు నాయుడుపేట టౌన్ నుండి చంద్రబాబు నాయుడు కాలనీ ద్వారా చెన్నై కలకత్తా జాతీయ రహదారి క్రాస్ చేసి నరసారెడ్డి కండ్రిగ వెళ్లే మార్గంలో తరచు ప్రమాదాలు జరుగుతున్నాయని స్థానిక ప్రజా ప్రతినిధుల ద్వారా తెలుసుకొన్న తిరుపతి ఎంపీ గురుమూర్తి వెంటనే జాతీయ రహదారుల సంస్థ ప్రాజెక్ట్ డైరెక్టర్ తో మాట్లాడారు.ప్రమాదాల నివారణకు చర్యలు చేపట్టాలని కోరడంతో వెంటనే స్పందించిన అధికారులు ఈరోజు ఉదయం సూచిక బోర్డులను ఏర్పాటు చేశారు. అలాగే ప్రమాదాల నివారణకు తగు చర్యలు తీసుకొంటామని తెలియజేశారు.ఇదిలా ఉండగా ఆ మార్గం లోనే ఉన్న రైల్వే అండర్ బ్రిడ్జిలో విద్యుత్ దీపాలు లేక రాత్రి సమయంలో ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిసి దక్షిణ రైల్వే జనరల్ మేనేజర్ కి లేఖ రాయగా పరిశీలించి త్వరలో లైట్స్ ఏర్పాటు చేస్తామని తెలియజేసారు.ఈ సమస్యలపై సత్వరమే స్పందించిన ఎంపీ గురుమూర్తికి ఆ ప్రాంత ప్రజలు ధన్యవాదములు తెలియజేశారు.