తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలో చేగువేరా ఫౌండేషన్ ఆధ్వర్యంలో గతం లో విస్తృతంగా సేవ కార్యక్రమాలు నిర్వహించారు.అందులో భాగంగా
పేద ప్రజలకు దుప్పట్లు పంపిణీ చేశారు.
చేగువేరా ఫౌండేషన్ వ్యవస్థాపకులు మండ్ల సురేష్ బాబు రాబోయే శీతా కాలాన్ని దృష్టి పెట్టుకుని పేదలకు దుప్పట్లు పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టారు.ఈ కార్యక్రమం సురేష్ బాబు ఆధ్వర్యంలో వేముల పాలెం గ్రామంలో నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గూడూరు రెవిన్యూ డివిజనల్ అధికారి ఎం.కిరణ్ కుమార్ విచ్చేయడంతోఘన స్వాగతం పలకుతూ ఆహ్వానించారు.ఆర్డవో చేతులు మీదగా దుప్పట్లు పంపిణీ చేసారు.
ఆర్డీవో కిరణ్ కుమార్ మాట్లాడుతూ చేగువేరా ఫౌండేషన్ నిరంతరం ప్రజా శ్రేయస్సు కోసం పాటు పడటం అభినందనీయమన్నారు.చేగువేరా కూడా పీడిత ప్రజల అభ్యున్నతి కోసం నిరంతరం పాటుపడ్డారని గుర్తుచేసారు. సమాజంలో ప్రతి ఒక్కరూ సేవ గుణం కలిగి ,పేద ప్రజలను ఆదుకోవాలని పిలుపునిచ్చారు.