Advertisements

గూడూరు రూరల్ AE గా వెంకటేశ్వర్లు .

తిరుపతి జిల్లా గూడూరు రూరల్ విద్యుత్ శాఖ అసిస్టెంట్ ఇంజనీర్ గా వెంకటేశ్వర్లు ఈరోజు బాధ్యతలు స్వీకరించారు.గూడూరు రూరల్ పరిధిలో గల గ్రామాలలో ఏవైనా విద్యుత్ సమస్యలు ఉంటే పరిష్కారం చేసేందుకు కృషి చేస్తాను అన్నారు. ప్రజలు ఎవరైనా ఇంటికి విద్యుత్ మీటర్లు మంజూరు కొరకు, దళారులను నమ్మకుండా నేరుగా విద్యుత్ కార్యాలయంలో సంప్రదించాలాన్నారు. ఆయా గ్రామ సచివాలయం లలో విద్యుత్ శాఖ కు చెందిన ఎనర్జీ అసిస్టెంట్ ఉంటారని, అతనిని సంప్రదించి ఎటువంటి విద్యుత్ సమస్య ఉన్న తెలియజేసిన తరువాత, వాటిని పరిష్కరించేలా చూస్తామన్నారు.గూడూరు మండలం లోని ప్రజలు ఇటువంటి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి అన్నారు. గూడూరు మండలం లోని ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటానని అసిస్టెంట్ ఇంజనీర్ వెంకటేశ్వర్లు తెలిపారు.

Leave a Comment