Advertisements

ఎస్.సి., ఎస్.టి. ల సంక్షేమం కోసమే డి వి ఎం సి : జాయింట్ కలెక్టర్

ఎస్.సి., ఎస్.టి. ల సంక్షేమం కోసమే డి వి ఎం సి : జాయింట్ కలెక్టర్

తిరుపతి, అక్టోబర్ 07: ఎస్.సి., ఎస్ టి ల కు అండగా నిలిచి  వారి సంక్షేమం కోసం,  జిల్లా విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ (అట్రాసిటీ చట్టం -1989) అండగా ఉంటుందని జాయింట్ కలెక్టర్ డి కె బాలాజీ అన్నారు. శనివారం ఉదయం స్థానిక కలెక్టరేట్ లో డి వి ఎం సి కమిటీ త్రై మాసిక   సమావేశం చైర్మన్ మరియు జిల్లా కలెక్టర్ కె.వెంకటరమణా రెడ్డి వారి ఆదేశాలతో జాయింట్ కలెక్టర్ అధ్యక్షతన జిల్లా ఎస్ పి పరమేశ్వర రెడ్డి కలసి   సమావేశం నిర్వహించారు.
జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ అన్నిమండలాల్లో సివిల్ రైట్స్ డే ప్రతినెలా  తప్పక నిర్వహించాలని, ఎస్.సి., ఎస్ టి ల  సమస్యలు జిల్లా కమిటీ దృష్టికి తీసుకువచ్చి పరిష్కరించాలని తెలిపారు. గత సమావేశంలో కమిటీ గౌరవ సభ్యులు సూచించిన సమస్యలు, పరిష్కరించిన వివరాలు కమిటీ కన్వినియర్  మరియు ఎస్.సి.సాధికార సంక్షేమ శాఖ అధికారి చెన్నయ్య కమిటికి తెలియజేసారు. బివి పురం , చింతల పాలెం,కలవగుంట భూసమస్యలు, ఎస్ సి ఎస్ టి లకు స్టాండప్ రుణాలు మంజూరు వంటివి చేపట్టిన చర్యలు కమిటీకి వివరించారు. హరిజన, గిరిజన వాడల  పేర్లు మార్పుపై జిల్లా పంచాయితీ అధికారి రాజశేఖర్ రెడ్డికి  సంబంధిత పంచాయితీలో రెజల్యూసన్ పాస్ చేసి కమిషనర్ పంచాయితీ రాజ్ కు నివేదిక పంపాలని సూచించారు.
జిల్లా ఎస్ పి వివరిస్తూ అట్రాసిటీ చట్టం క్రింద 2023 నమోదు అయిన 61 కేసుల్లో 83 మందికి  పరిహారం క్రింద దాదాపు రూ.62 లక్షలు మంజూరు అయిందని వివరించారు. అలాగే సభ్యులు సూచిస్తూ స్థానిక అఆటోనగర్ నగర్ వద్ద మూతపడ్డ లిడ్ క్యాప్ పరిశ్రమ భూములు అన్యాక్రాంతం అవుతున్నాయని సరిహద్దులు ఏర్పాటు చేసి రక్షించాలని కోరారు.
ఈ సమీక్షలో అడిషనల్ ఎస్ పి వెంకట్రావు, డి ఆర్ ఓ పెంచల కిషోర్ , అర్దిఒలు కనకనరసా రెడ్డి, రామారావు, కిరణ్ కుమార్ , కమిటీ సభ్యులు ప్రసాద్ బాబు , ఎన్.వెంకటరమణ , వెంకటా చలం , కె.వెంకటరమణ , జిల్లా అధికారులు పాల్గొన్నారు.

Leave a Comment