పేద ప్రజల అభివృద్ధి, ఆరోగ్యమే ద్యేయంగా రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు వైయస్ జగన్మోహన్ రెడ్డి పనిచేస్తున్నారని ఎమ్మెల్యే వరప్రసాద్ రావు, స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్ చైర్పర్సన్ పొనకా దేవసేనమ్మ పేర్కొన్నారు. చిల్లకూరలో జరిగిన జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమంలో వారు పాల్గొని మాట్లాడారు తిరుపతి జిల్లా .చిల్లకూరు మండల పరిధిలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో శనివారం జగనన్న సురక్ష కార్యక్రమం నిర్వహించారు.ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే వరప్రసాద్ రావు, స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్ చైర్ పర్సన్ పొనకా దేవసేనమ్మ పాల్గొని ప్రజల ఆరోగ్య సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఐసిడిఎస్ సిబ్బంది ఏర్పాటుచేసిన పౌష్టికాహార స్టాల్స్ ను పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ…పేద ప్రజల అభివృద్ధి, ఆరోగ్యమే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ద్యేయమని, అందరికీ ఒకేలా పారదర్శకమైన పాలన అందిస్తున్న ఏకైక పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని, పేద ప్రజల అభివృద్ధి కోసం పరితపించే జగన్మోహన్ రెడ్డి లాంటి నేతను తన 50 ఏళ్ల అనుభవంలో ఎప్పుడూ చూడలేదని, ప్రజలందరూ వైయస్సార్ పార్టీని మరోసారి ఆదరించి గెలిపించాలని కోరారు .
స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్ చైర్పర్సన్ పొనకా దేవసేన మాట్లాడుతూ… రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు వైయస్ జగన్మోహన్ రెడ్డి పేద ప్రజలందరూ ఆరోగ్యంగా ఉండాలనే తలంపుతో జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమాన్ని ప్రవేశ పెట్టడం జరిగిందని, వృద్ధుల్లో చెప్పుకోలేని సమస్యలు ఏమైనా ఉంటే డాక్టర్లు స్వయంగా వారి వద్దకు వెళ్లి, వారి ఆరోగ్య సమస్యలను అడిగి తెలుసుకుని, పరిష్కరించాలని, ప్రతి ఒక్కరూ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడం తమ బాధ్యతగా భావించాలని, మేనిఫెస్టోలో పెట్టిన పథకాలనే కాకుండా, అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి,అహర్నిశలు ప్రజల కోసం పరితపిస్తున్న వైయస్ జగన్మోహన్ రెడ్డిని రాష్ట్ర ప్రజలందరూ తమ అమూల్యమైన ఓట్లను వేసి అఖండ మెజారిటీతో మరల గెలిపించాలని, కోరారు
ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ వెంకటేశ్వర్లు, జడ్పిటిసి మన్నెం శ్రీనివాసులు,amc చైర్మన్ ఓడూరు యమనమ్మ, తాసిల్దార్ శ్రీనివాసులు, ఎస్సై అంజిరెడ్డి, డాక్టర్లు భావన్నారాయణ, అరాఫత్, మోహన, నాయకులు కొట్టు అశోక్, అనుదీప్, వెంపులూరు శ్రీనివాసులు, కాటూరు శ్రీహరి, సచివాలయ సిబ్బంది. తదితరులు పాల్గొన్నారు*.